పోల్ అధికారికి గుండెనొప్పి.. ప్రాణం కాపాడిన CRPF జవాన్
బచ్ పొరా (జమ్ముకశ్మీర్) : జమ్మూకశ్మీర్ లో పోలింగ్ డ్యూటీకి హాజరైన ఎన్నికల అధికారి ప్రాణాలను సీఆర్ పీఎఫ్ జవాన్ రక్షించాడు.

బచ్ పొరా (జమ్ముకశ్మీర్) : జమ్మూకశ్మీర్ లో పోలింగ్ డ్యూటీకి హాజరైన ఎన్నికల అధికారి ప్రాణాలను సీఆర్ పీఎఫ్ జవాన్ రక్షించాడు.
బచ్ పొరా (జమ్ముకశ్మీర్) : జమ్మూకశ్మీర్ లో పోలింగ్ డ్యూటీకి హాజరైన ఎన్నికల అధికారి ప్రాణాలను సీఆర్ పీఎఫ్ జవాన్ రక్షించాడు. గురువారం ఉదయం (ఏప్రిల్ 18, 2019) పోలింగ్ జరుగుతున్న సమయంలో 13వ పోలింగ్ దగ్గర విధుల్లో ఉన్న ప్రెసైడింగ్ అధికారి (PO) హాసన్ ఉల్ హక్ కు గుండెనొప్పి వచ్చింది. అక్కడే విధులు నిర్వర్తిస్తున్న సీఆర్ పీఎఫ్ సిబ్బంది సురీందర్ కుమార్ అప్రమత్తమయ్యాడు.
వెంటనే వైద్యుడు సునీమ్ సాయం తీసుకున్నాడు. పోలింగ్ కేంద్రానికి అంబులెన్స్ రావడానికి 50 నిమిషాల సమయం పట్టింది. అంబులెన్స్ వచ్చేవరకు డాక్టర్ ఫోన్లో సూచించినట్టు హాసన్ కు సీఆర్పీఎఫ్ జవాన్ ఫస్ట్ ఎయిడ్ అందించాడు. డాక్టర్ సూచించినట్టుగా నోటి ద్వారా శ్వాస అందిస్తూ, గుండె కొట్టుకునేంతవరకు సీపీఆర్ అందించాడు.
అంబులెన్స్ వచ్చేవరకు పోలింగ్ అధికారి ప్రాణాలు కాపాడాడు. మెరుగైన చికిత్స కోసం హాసన్ ను అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు. సమయస్ఫూర్తితో పోలింగ్ అధికారికి సకాలంలో చికిత్స అందించిన సీఆర్ పీఎఫ్ జవాన్ ను అధికారులు ప్రశంసించారు.