Culcutta HC
Calcutta HC : కొన్ని కేసుల్లో న్యాయస్థానాలు ఇచ్చేతీర్పులు..ఆ తీర్పుల సందర్భంగా చేసే వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉంటాయి. ఓ పిటీషనర్ దాఖలు చేసిన కేసు విచారణ సందర్భంగా కోల్ కతా కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘నా భార్యకు విడాకులు ఇచ్చి నిన్ను రెండో పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి ఆ తరవాత నిన్ను పెళ్లి చేసుకోలేను’ అని హ్యాండిచ్చిన వ్యక్తిపై ఓ మహిళ కోల్ కతా హైకోర్టును ఆశ్రయించింది. నన్ను మోసం చేశాడు న్యాయం చేయమంటూ ధర్మాసనాన్ని వేడుకుంది. ఈకేసుపై వాది ప్రతివాదులు సమర్పించిన అన్ని సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయస్థానం పిటీషన్ వేసిన మహిళకు షాక్ ఇచ్చింది.
రెండో పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి తప్పటం నేరం కాదని వ్యాఖ్యానించింది. అంతేకాదు సదరు వ్యక్తికి వివాహం అయ్యిందని తెలిసి అతనితో శారీరక సంబంధం పెట్టుకుని సహజీనం చేస్తు మోసం చేశాడని అనటం సరికాదు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రెండో పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి ఆపై మోసం చేశాడంటూ ఓ మహిళ వేసిన కేసులో కలకత్తా హైకోర్టు కీలక తీర్పు ఇచ్చే సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది హైకోర్టు. రెండో పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి ఆ తర్వాత నెరవేర్చకపోవడం నేరం కిందికి రాదని..మొదటి సంబంధం (వ్యక్తికి వివాహం జరిగిందని తెలిసికూడా) గురించి తెలిసి కూడా అతడితో ఆమె సంబంధం పెట్టుకుందని, కాబట్టి దీనిని మోసంగా పరిగణించలేమని కోర్టు స్పష్టం చేసింది.
కోల్‌కతాకు చెందిన ఓ వ్యక్తి మొదటి భార్యతో విడాకులు కావలని వేసిన కేసు కోర్టులో విచారణలు కొనసాగుతున్నాయి. వారికి పిల్లలు కూడా ఉన్నారు.ఈక్రమంలో అతనికి మరో మహిళతో పరిచయం అయ్యింది. అలా వారిద్దరికి ఒకరిపై మరొకరికి ఇష్టం ఏర్పడింది. అలా ఆమెను ఇష్టపడిన అతను నా విడాకుల కేసు కోర్టులో ఉంది విడాకులు రాగానే నిన్ను పెళ్లి (రెండో పెళ్లి) చేసుకుంటానని మాటిచ్చాడు. దీంతో వీరిద్దరు ఒకే అపార్ట్‌మెంటులో 11 నెలలపాటు కలిసే ఉన్నారు. శారీరకంగా కూడా దగ్గరయ్యారు. అలా దాదాపు సంవత్సరం అవుతుండగా అతనికి సడెన్ గా భార్యా తన కూతురు భవిష్యత్తు గుర్తుకొచ్చింది. దీంతో మొదటి భార్యకు విడాకులు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాడు. అదే విషయం ఆమెతో చెప్పాడు.
దీంతో ఆవహ తనను రెండో పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి మోసం చేశాడంటూ అలీపూర్ కోర్టులో కేసు వేసింది. విచారణ చేపట్టిన కోర్టు అతడు ఆమెను నమ్మించి మోసం చేసాడని తీర్పునిచ్చింది. రూ. 10 లక్షల జరిమానా కూడా విధించింది. వీటిలో రూ. 8 లక్షలు మహిళకు, రూ. 2 లక్షలు ప్రభుత్వ ఖజానాకు చెల్లించాలని ఆదేశించింది. లేదంటే జైలుశిక్ష తప్పదని హెచ్చరించింది.
అలీపూర్ కోర్టు తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేసిన సదరు వ్యక్తి కోల్ కతా కోర్టులో సవాల్ చేశాడు. పిటీషన్ లో తాను ఆమెతో ఏ విషయాన్ని దాచలేదని..మొదటి భార్య, పిల్లలు సహా మొత్తం పరిస్థితిని చెప్పానని కోర్టుకు తెలిపాడు. అతడి వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి జస్టిస్ సిద్ధార్థ రాయ్ చౌధురి.. వ్యక్తిగత జీవితం గురించి అన్నీ తెలిసి కూడా అతడితో ఆమె సంబంధం పెట్టుకుందని..అన్నీ తెలిసి కూడా సంబంధాన్ని కొనసాగించిన ఆమెదే తప్పు అంటూ నిర్ధారించారు. వివాహం కాకుండా సంబంధం పెట్టుకోవటం రిస్కు ఉందనే విషయం తెలిసి కూడా దాన్ని కొనసాగించిందని కాబట్టి దీనిని మోసంగా పరిగణించలేమని స్పష్టం చేశారు.
పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి, శారీరక సంబంధం పెట్టుకున్నా మోసం చేసినట్టు కేసు పెట్టలేరని పేర్కొన్నారు. అన్నీ తెలిసే ఆమె అతడితో సంబంధాన్ని కొనసాగించింది కాబట్టి ఇక్కడ మోసం అనే మాటే లేదని అలీపూర్ కోర్టు ఇచ్చిన తీర్పును న్యాయమూర్తి స్పష్టంచేస్తు కేసును కొట్టివేశారు.