ముళ్ల పొదల్లో రూ. 36 లక్షలు : ఎక్కడాచోటు లేనట్లు ఇక్కడ దాచారేంట్రా బాబూ..

  • Publish Date - October 9, 2020 / 04:32 PM IST

Currency notes worth Rs.36 lakhs found : దొంగలు దోచుకున్న డబ్బుని బీరువాల్లోను..బ్యాగుల్లోను దాచుకుంటారు. కానీ కొంతమంది అతితెలివి ఉన్న దొంగలు మాత్రం తాము దోచుకున్నడబ్బుని ముళ్లపొదల్లో దాచారు. కానీ దొంగలకు బ్యాడ్ లక్ తో అవి కాస్తా..పోలీసుల కళ్లబడటంతో గుట్టంతా రట్టైంది. ఈ ఘటన కర్నాటకలో జరుగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.


చిత్రదుర్గ జిల్లా చల్లకెరె తాలూకాలోని బుక్లోరహల్లి గ్రామంలోని వ్యవసాయ భూమికి సమీపంలో ఉన్న ముళ్ల పొదల్లో రూ. 36 లక్షలు విలువచేసే నోట్ల కట్టలు దొరికాయి. ఇవి రూ. 50, రూ. 100, రూ. 2000 విలువతో ఉన్న నోట్ల కట్టలు.




కొన్ని రోజుల క్రితం బుక్లోరహల్లి గ్రామానికి సమీపంలో ఉన్న దిలీప్ బిల్డ్ కాన్ లిమిటెడ్‌ సంస్థకి చెందిన ఆఫీస్ నుంచి రూ. 36 లక్షలు చోరీ అయ్యాయి. ఈ క్రమంలో బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులకు ముళ్లపొదల్లో దొరికిన నగదు చోరీకి గురైందేనని భావిస్తున్నారు.


కొన్ని రోజుల క్రితం ఇదే గ్రామానికి సమీపంలో ఉన్న దిలీప్ బిల్డ్ కాన్ లిమిటెడ్ కార్యాలయం నుంచి దొంగలు రూ. 36 లక్షలు దొంగతనం చేశారు. నిర్మాణ రంగానికి చెందిన ఈ కంపెనీ.. బీదర్ – శ్రీరంగపట్నం జాతీయ రహదారి పనులను చేస్తోంది.




దొరికిన డబ్బుపై విచారణ చేపట్టిన పోలీసులు స్నిపర్ డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిన్ నిపుణుల సహాయం తీసుకున్నారు. స్నిపర్ డాగ్‌లు డబ్బు ఉన్న చోటును గుర్తించాయి. డబ్బులను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఈ ఘటనలో దొంగలెవరో గుర్తించే పనిలో పడ్డారు.