Thomson TV : షాకింగ్.. ఆన్‌లైన్‌లో ఖరీదైన వస్తువులు ఆర్డర్ చేస్తున్నారా? బీకేర్ ఫుల్.. లక్ష రూపాయల టీవీ ఆర్డర్ చేస్తే ఏం వచ్చిందో చూడండి

లక్ష రూపాయల ఖరీదైన సోనీ బ్రాండ్ టీవీని కొనుగోలు చేశాడు. అక్టోబర్ 7వ తేదీన అతడు డబ్బు చెల్లించాడు. అక్టోబర్ 10వ తేదీన ఇంటికి డెలివరీ వచ్చేసింది. Thomson TV

Thomson TV Instead Of Sony TV (Photo : Google)

Thomson TV Instead Of Sony TV : ఆఫర్లే ఆఫర్లే.. భారీగా డిస్కౌంట్లు.. క్యాష్ బ్యాక్ లు.. తక్కువ ధరకే ఖరీదైన వస్తువులు.. ఇదీ ఆన్ లైన్ బిజినెస్ తీరు. అందుకే.. ఈ మధ్య కాలంలో ఆన్ లైన్ లో కొనుగోళ్లు విపరీతంగా పెరిగిపోయాయి. అదిరిపోయే ఆఫర్లు, సరసమైన ధరలతో టెంప్ట్ చేస్తుండటంతో ఆన్ లైన్ బిజినెస్ పెరిగిపోయింది. ఆన్ లైన్ లో కొనుగోళ్లు చేసే వారి సంఖ్య భారీగా పెరిగింది. అదే సమయంలో కస్టమర్లు జాగ్రత్తగా ఉండాలి. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఎందుకంటే ఆన్ లైన్ లో మనం ఒకటి ఆర్డర్ చేస్తే మరొకటి డెలివరీ చేస్తున్నారు.

అవును.. ఇటీవలి కాలంలో ఆన్ లైన్ లో కొనుగోలు చేసే వస్తువుల వ్యవహారం చాలా గందరగోళంగా తయారైంది. ప్రముఖ ఈ కామర్స్ సైట్స్ లో మనం ఒకటి ఆర్డర్ చేస్తే.. మరొకటి డెలివరీ చేస్తున్నాయి. ఒక్కోసారి రాళ్లు, ఇటుకలు, సబ్బులు కూడా వస్తున్నాయి. దీంతో కస్టమర్లు షాక్ కి గురవుతున్నారు. ఈ కామర్స్ సైట్స్ తీరుతో కొనుగోలుదారులకు దిమ్మతిరిగిపోతోంది.

Also Read : కొత్త ఫోన్ కావాలా? టాప్ 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి!

తాజాగా మరో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి లక్ష రూపాయల ఖరీదైన సోనీ టీవీని ఫ్లిప్ట్ కార్ట్ లో ఆర్డర్ చేస్తే.. అతడికి మరో బ్రాండ్ కి చెందిన టీవీని డెలివరీ చేశారు. అది కూడా చాలా తక్కువ ధరది. దాంతో ఆ వ్యక్తి షాక్ కి గురయ్యాడు. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే.. ఇంతవరకు అతడి సమస్య పరిష్కారమే కాలేదు.

అతడి పేరు ఆర్యన్. ఫ్లిప్ కార్ట్ బిలియన్ డేస్ సేల్ లో భాగంగా సోనీ టీవీ కొనాలని ప్లాన్ చేశాడు. పెద్ద సైజు టీవీలో వన్డే వరల్డ్ కప్ చూసి ఎంజాయ్ చేద్దామనుకున్నాడు. దాంతో ఫ్లిప్ కార్ట్ లో లక్ష రూపాయల ఖరీదైన సోనీ బ్రాండ్ టీవీని కొనుగోలు చేశాడు. దాని ఖరీదు లక్ష రూపాయలు. అక్టోబర్ 7వ తేదీన అతడు డబ్బు కూడా చెల్లించాడు. అక్టోబర్ 10వ తేదీన ఇంటికి డెలివరీ వచ్చేసింది. ఓ బాక్స్ లో టీవీ ఉంది. అదే రోజున సోనీ కంపెనీ నుంచి టీవీని ఇన్ స్టాల్ చేసేందుకు సిబ్బంది కూడా వచ్చారు. టీవీని బిగించేందుకు అతడు బాక్స్ ని ఓపెన్ చేశాడు.

అంతే, ఆర్యన్ తో పాటు టీవీ ఇన్ స్టలేషన్ చేసేందుకు వచ్చిన వ్యక్తి షాక్ తిన్నారు. అందులో సోనీ టీవీ లేదు. థామ్సన్ కంపెనీ టీవీ ఉంది. అది కూడా చాలా తక్కువ ధరది. అంతేకాదు అందులో స్టాండ్, రిమోట్ లాంటి పరికరాలు ఏవీ కూడా లేవు. దీంతో ఆర్యన్ కు దిమ్మతిరిగిపోయింది. వెంటనే అతడు ఫ్లిప్ కార్ట్ కస్టమర్ కేర్ కి ఫోన్ చేశాడు. జరిగిన విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లి ఫిర్యాదు చేశాడు. వెంటనే తన సమస్యను పరిష్కరించాలని వేడుకున్నాడు. కానీ నో యూజ్. ఇలా ఫిర్యాదు చేసి రెండు వారాలు గడిచినా అతడి సమస్య మాత్రం పరిష్కారం కాలేదు.

”ఫ్లిప్‌కార్ట్ కస్టమర్ కేర్‌తో నేను ఈ సమస్యను తక్షణమే లేవనెత్తాను. వారు నన్ను టీవీ ఫోటోలను అప్‌లోడ్ చేయమని అడిగారు. వారి సూచనల ప్రకారం ఫోటోలను అప్‌లోడ్ చేశాను. కానీ ప్రయోజనం లేదు. ఇంతవరకు నా సమస్య పరిష్కారం కాలేదు. నాకు అందిన టీవీ ఫోటోలను అప్‌లోడ్ చేయమని మూడు సార్లు అడిగారు. వారు అడిగిన విధంగా నేను అప్‌లోడ్ చేశాను. కానీ లాభం లేదు” అని ఆర్యన్ తన ట్వీట్ లో వాపోయాడు. ఫ్లిప్ కార్ట్ కస్టమర్ కేర్ ప్రతినిధులు ఎన్నిసార్లు అడిగారో అన్నిసార్లు ఆర్యన్ టీవీ ఫోటోలు తీసి వారికి అప్ లోడ్ చేశాడు. కానీ, అతడి ప్రాబ్లమ్ మాత్రం సాల్వ్ కాలేదు.

Also Read : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. నో వెయిటింగ్, నో ఆర్ఏసీ.. అసలు విషయమేంటో తెలుసుకోండి

”మొదట అక్టోబర్ 24న రిజల్యూషన్ తేదీ ఇచ్చారు ఫ్లిప్ కార్ట్ వాళ్లు. 20వ తేదీన వారు దానిని పరిష్కరించినట్లు చూపించారు. ఆ తర్వాత నవంబర్ 1వ తేదీకి పొడిగించారు. సమస్య పరిష్కరించబడిందని నాకు చూపించారు. కానీ నా రిటర్న్ అభ్యర్థన ప్రాసెస్ చేయలేదు. నేను BBD టీవీని కొనుగోలు చేయడానికి వేచి ఉన్నాను. క్రికెట్ వరల్డ్ కప్ మంచి పెద్ద స్క్రీన్‌పై చూడాలని ఆశపడ్డాను. కానీ ఫ్లిప్ కార్ట్ నిర్లక్ష్యం కారణంగా ఆ కోరిక తీరలేదు” అని మరో ట్వీట్ లో తన బాధ పంచుకున్నాడు ఆర్యన్.

కాగా, కొరియర్ కంపెనీ డెలివరీ.. టీవీని డెలివరీ చేసింది. అయితే డెలివరీ టైమ్ లో అందులో ఏముంది అని చెక్ చేసుకునే ఆప్షన్ వారి దగ్గర లేదని ఆర్యన్ తెలిపారు. ఆర్యన్ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది వైరల్ గా మారిపోయింది. అయ్యో పాపం అని నెటిజన్లు ఆర్యన్ పట్ల సానుభూతి చూపిస్తున్నారు. అదే సమయంలో కొందరు యూజర్లు తమ అనుభవాలను పంచుకున్నారు. ఆన్ లైన్ లో ఖరీదైన వస్తువులు కొనుగోలు చేసే విషయంలో కొందరు సూచనలు, సలహాలు ఇచ్చారు.

”ఫ్లిప్ కార్ట్ లాంటి ఈ కామర్స్ సైట్స్ లో నేను ఎప్పుడూ కూడా ఖరీదైన వస్తువులు కొనుగోలు చేయను. నేను ఓసారి ఫోన్ ఆర్డర్ చేసి బ్యాడ్ ఎక్స్ పీరియన్స్ చవి చూశాను. అప్పటి నుంచి ఖరీదైన వస్తువు ఏదైనా ఆన్ లైన్ లో కొనుగోలు చేయను. ఆన్ లైన్ లో కొనుగోలు చేయడానికి బదులుగా దగ్గరలో ఉండే స్టోర్ కి వెళ్లి కొంటాను” అని ఓ నెటిజన్ తన అనుభవాన్ని షేర్ చేశాడు.

ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు వీలైనంత త్వరగా వాటిని పరిష్కరించేలా ఆన్ లైన్ ప్లాట్ ఫార్మ్స్ కోసం కేంద్ర ప్రభుత్వం కఠినమైన నిబంధనలు తీసుకురావాలని ఓ నెటిజన్ డిమాండ్ చేశాడు. ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు వాటిని చెప్పుకోవడానికి.. కొన్ని ఈ కామర్స్ సైట్స్ కు కనీసం కస్టమర్ కేర్ మెయిల్ ఐడీ, కాంటాక్ట్ నెంబర్లు కూడా ఉండవని వాపోయాడు. అలాంటి పరిస్థితుల్లో బాధితుడికి ఉన్న ఏకైన మార్గం కన్జూమర్ ఫోరమ్ ని ఆశ్రయించడమే అని చెప్పాడు.