Snakes Chameleon
Snakes Chameleon : తమిళనాడులోని చెన్నై విమానాశ్రయంలో ఓ మహిళా ప్రయాణికురాలి లగేజ్ బ్యాగుల్లో 22 పాములు, ఒక ఊసరవెల్లి కలకలం రేపాయి. వీటిని చూసి కస్టమ్స్ అధికారులు షాక్ అయ్యారు. ఏప్రిల్ 28వ తేదీన ఒక మహిళా మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి ఏకే 13 విమానంలో చెన్నై విమానాశ్రయానికి చేరుకున్నారు.
అయితే సదరు మహిళపై అనుమానం రావడంతో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని ఆమె లగేజ్ ను తనిఖీ చేశారు. మహిళకు చెందిన బ్యాగుల్లో పలు జాతులకు చెందిన 22 పాములు, ఒక ఊసరవెల్లి కనిపించాయి. వీటిని చూసిన కస్టమ్స్ అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు.
Indian Couple: 45 పిస్టోళ్లు తీసుకెళ్తూ పట్టుబడిన ఇండియన్ జంట
పాములు పట్టే వారిని రప్పించి పాములను స్వాధీనం చేసుకున్నారు. మహిళను అరెస్టు చేసి ఆమెపై కస్టమ్స్ చట్టంతోపాటు వన్యప్రాణుల రక్షణ చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
మహిళను స్థానిక కోర్టులో ప్రవేశపెట్టగా ఆమెకు 14 రోజుల కస్టడీ రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. పాములు, ఉసరవెల్లిని అక్రమంగా ఎవరికి రవాణా చేస్తున్నారో అన్నదానిపై దర్యాప్తు చేపట్టారు. మహిళ బ్యాగుల నుంచి బయటపడిన పాముల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.