పూరీలో విధ్వంసం : టవర్లు, క్రేన్లు ఎలా కూలిపోయాయో చూడండీ

త్యంత ఎత్తులో ఉండటంతో.. భీకర గాలులకు ఇది పక్కన ఉన్న ఇళ్లపై పడింది. దీంతో 10 ఇళ్లు దెబ్బతిన్నాయి. చాలా మందికి తీవ్రగాయాలు అయ్యాయి. భారీ వర్షం, గాలులు తీవ్రంగా

  • Publish Date - May 3, 2019 / 10:48 AM IST

త్యంత ఎత్తులో ఉండటంతో.. భీకర గాలులకు ఇది పక్కన ఉన్న ఇళ్లపై పడింది. దీంతో 10 ఇళ్లు దెబ్బతిన్నాయి. చాలా మందికి తీవ్రగాయాలు అయ్యాయి. భారీ వర్షం, గాలులు తీవ్రంగా

ఒడిషాలో తీరం దాటిన తుఫాన్ చేసిన విధ్వంసం అలా ఇలా లేదు. 200 కిలోమీటర్ల వేగంతో గాలులు ప్రళయాన్ని తీసుకొచ్చాయి. సెల్ టవర్లు, భారీ క్రేన్లు అమాంతం కూలిపోయాయి. వందల సంఖ్యలో ఇవి పడిపోయాయి. పూరీ సిటీలో శివార్లలో నిర్మాణం జరుగుతున్న భారీ అపార్ట్ మెంట్ టవర్ల దగ్గర ఏర్పాటు క్రేన్ పడిపోయింది. అత్యంత ఎత్తులో ఉండటంతో.. భీకర గాలులకు ఇది పక్కన ఉన్న ఇళ్లపై పడింది. దీంతో 10 ఇళ్లు దెబ్బతిన్నాయి. చాలా మందికి తీవ్రగాయాలు అయ్యాయి. భారీ వర్షం, గాలులు తీవ్రంగా ఉండటంతో సహాయ చర్యలు కూడా ఇంకా ప్రారంభించలేదు.

చాంద్ బలీ ప్రాంతంలో.. ఓ స్థలంలో ఏర్పాటు చేసిన సెల్ టవర్ గాలులధాటికి పడిపోయింది. ఇది కూడా ఓ కెమెరాలో బంధించారు ఆ రోడ్డులో వెళుతున్న వ్యక్తులు. తుఫాన్ ప్రభావం ఎంత భయంకరంగా ఉందో ఈ వీడియో చెబుతుంది అనే ట్యాగ్ పెట్టారు.