Cyclone Tej : అరేబియా సముద్రంలో బలపడుతున్న తేజ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలపై ఎఫెక్ట్ ఉంటుందా? IMD కీలక ప్రకటన

అక్టోబర్ 25 తెల్లవారు జామున అల్ గైదా (యెమెన్), సలాలా (ఒమన్) మధ్య తుఫాను తీరాలను దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అకస్మాత్తుగా దిశను మార్చుకునే అవకాశం లేకపోలేదని, ఈ కారణంగా తుఫాను ఎక్కడ తీరాన్ని తాకనుందనేది ఇప్పుడు ఖచ్చితంగా చెప్పలేమని ఐఎండీ తెలిపింది.

India Meteorological Department

Weather Report Cyclone Tej: అరేబియా సముద్రంలో ఏర్పడిన తేజ్ తుఫాన్ క్రమంగా బలపడుతోంది. ఈరోజు (ఆదివారం) మధ్యాహ్నం సమయానికి తీవ్రమైన తుఫానుగా మారుతుందని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) తెలిపింది. ఈ తుఫాన్ మరో రెండు రోజుల్లో యెమెన్, ఒమన్ మధ్య తీరందాటే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ తుఫాన్ ఒమన్, యెమెన్ తీరం వైపు పయనిస్తోంది. ఇది నైరుతి అరేబియా సముద్రంలో దాదాపు 240 కిలోమీటర్లు తూర్పు-ఆగ్నేయంగా సోకోత్రా (యెమెన్), 600 కిలో మీటర్లు దక్షిణ-ఆగ్నేయంగా సలాలా (ఒమన్) మరియు 720 కిలోమీటర్లు ఆగ్నేయ అల్ గైదా ( యెమెన్) వద్ద కేంద్రీకృతమైంది.

Read Also : IND Vs NZ Match Prediction: ఆనాటి ఓటమికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందా? పిచ్ ఎవరికి సహకరిస్తుందంటే..

అక్టోబర్ 25 తెల్లవారు జామున అల్ గైదా (యెమెన్), సలాలా (ఒమన్) మధ్య తుఫాను తీరాలను దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అకస్మాత్తుగా దిశను మార్చుకునే అవకాశం లేకపోలేదని, ఈ కారణంగా తుఫాను ఎక్కడ తీరాన్ని తాకనుందనేది ఇప్పుడు ఖచ్చితంగా చెప్పలేమని ఐఎండీ తెలిపింది. ఈ తుఫాను మన దేశంలోని గుజరాత్ పై ప్రభావం చూపే అవకాశం ఉందని, అయితే, పశ్చిమ వాయవ్య దిశగా కదులుతున్నందున గుజరాత్ తూర్పు ప్రాంతంపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చని ఐఎండీ అంచనా వేసింది.

Read Also : Russia Strikes Ukraine : ఉక్రెయిన్ పై రష్యా మరోసారి క్షిపణి దాడి.. పోస్టల్ డిపోపై దాడి ఘటనలో ఆరుగురు మృతి

తెలుగు రాష్ట్రాలపై ఈ తుఫాను ప్రభావం ఉండకపోవచ్చు. ఐఎండీ ప్రకారం.. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో మేఘాలతో కూడిన వాతావరణం ఉంటుంది. వర్షాలు పడే అవకాశాలు లేవు. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. అయితే, అరేబియా సముద్రంలో ఈ ఏడాది ఏర్పడిన రెండో తుఫాను తేజ్. ఈ ఏడాది జూన్ లో బిపర్ జోయ్ తుఫాను గుజరాత్ లోని కచ్, సౌరాష్ట్రలోని కొన్ని ప్రాంతాలను అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. కచ్ లో తుఫాన్ తీరందాటింది. తాజాగా తీవ్ర తుఫాన్ గా మారుతున్న తేజ్ ప్రస్తుతం ఒమన్, యెమెన్ మధ్య ప్రాంతాల్లో తీరం దాటే అవకాశం ఉంది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో తుఫానులకు పేర్లు పెట్టడానికి అనుసరిస్తున్న ఫార్ములా ప్రకారం ప్రస్తుతం అరేబియా మహాసముద్రంలో ఏర్పడిన తుఫాన్ కు ‘తేజ్’ నామకరణం చేశారు.

 

ట్రెండింగ్ వార్తలు