పేరుకు అతడు రోజువారీ కూలీ. దేశంలో నిరుద్యోగ సమస్యపై ఇంగ్లీష్ లో స్పీచ్ దంచేశాడు. ఉద్యోగ సమస్యలపై ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఆ కూలీ దిమ్మతిరిగే బదులిచ్చాడు.
పేరుకు అతడు రోజువారీ కూలీ. దేశంలో నిరుద్యోగ సమస్యపై ఇంగ్లీష్ లో స్పీచ్ దంచేశాడు. ఉద్యోగ సమస్యలపై ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఆ కూలీ దిమ్మతిరిగేలా బదులిచ్చాడు. ఇంగ్లీష్ లో అనర్గళంగా మాట్లాడుతూ.. రిపోర్టర్ , అక్కడి జనానికి షాక్ ఇచ్చాడు. అప్పటి మాజీ ప్రధాని ఇందిరాగాంధీ సమయంలో ఉద్యోగాల స్థితిపై ఇప్పటి ఉద్యోగాల స్థితిపై ఏకధాటిగా ఇంగ్లీష్ లో మాట్లాడాడు.
హిందీలో ప్రశ్న అడిగితే.. ఇంగ్లీష్ లో సమాధానం ఇస్తూ… ఐ వాంట్ టూ వర్క్ అని అన్నాడు. ఇంగ్లీష్.. హా.. యస్.. వై నాట్..? అంటూ బదులిచ్చాడు. కూలీ షాకింగ్ స్పీచ్ విని ఆ రిపోర్టర్ కంగుతిన్నాడు. ఇంతకీ మీరు ఏం చదువుకున్నారని అడిగితే.. తాను గ్రాడ్యువేట్ అని.. బీహార్ భగల్ పూర్ యూనివర్శిటీలో డిగ్రీ పూర్తిచేసినట్టు కూలీ చెప్పాడు. ఉద్యోగం లేక రోజువారీ కూలీగా ఇలా పొట్టబోసుకుంటున్నట్టు చెప్పుకొచ్చాడు. రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Also : నెటిజన్లు ఫిదా : నాగిని డ్యాన్స్ తో అదరగొట్టిన సన్నీ లియోన్