వెంట్రుకలు నిక్కపొడిచే సీన్ : మూడో అంతస్తు నుంచి పడిపోయిన బుడ్డోడు

  • Publish Date - December 4, 2019 / 06:09 AM IST

వెంట్రుకలు నిక్కపొడిచే సీన్ అది. మూడో అంతస్తు నుంచి పడిపోయిన బుడ్డోడిని స్థానికులు కాపాడారు. బంతిలా కిందకు పడిపోతున్న చిన్నోడిని సురక్షితంగా చేతులతో పట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన డామన్ డయ్యూలో చోటు చేసుకుంది. డిసెంబర్ 03వ తేదీ మంగళవారం రాత్రి..రెండేళ్ల చిన్నోడు..ప్రమాదవశాత్తు మూడో అంతస్తు గోడ చివరి అంచున నిలబడిపోయాడు. భయంతో ఏడ్చాడు. అప్పుడే అక్కడ వెళుతున్న వారికి ఏడుపు శబ్దాలు వినిపించాయి. కానీ ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియలేదు. పైకి చూడగా..అంతస్తు గోడను పట్టుకున్న చిన్నోడు కనిపించాడు. 
Read More : హైదరాబాద్‌కు ఈజిప్టు ఉల్లి..ఢిల్లీకి టర్కీ ఉల్లిగడ్డలు
వెంటనే రక్షించాలని అనుకున్నారు. ఓ పది మందిదాక ఒక దగ్గరకు చేరాడు. ఇంతలో మూడో అంతస్తు నుంచి వేగంగా కిందకు పడిపోయాడు. అక్కడున్న ఓ వ్యక్తి చేతులతో బాలుడిని సురక్షితంగా పట్టుకున్నాడు. కానీ ఇద్దరూ కిందపడిపోయారు. బాలుడికి..పట్టుకున్న వ్యక్తికి ఎలాంటి గాయలు కాలేదు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. బాబును కాపాడిన వారిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఎంతోమంది హృదయాలను గెలుచుకున్నారంటూ..ఆనందం వ్యక్తం చేస్తున్నారు.