Dangerous social distancin : ఓ..బాబులూ..భౌతిక దూరం అంటే ఇలా కాదమ్మా…

కరోనాను కట్టడి చేయాలంటే సోషల్ డిస్టెన్స్ (భౌతిక దూరం) తప్పనిసరి అయిన క్రమంలో కొన్ని భౌతిక దూరాలు ప్రమాదాలను తెచ్చిపెడతాయనే విషయం మీకు తెలుసా? అది కరోనా సమయం అయినసరే. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద మహేంద్రా తన ట్విట్టర్ లో షేర్ చేసిన ఈ ఫోటో చూస్తే మీరు కూడా అదే అంటారు.

Dangerous Social Distancing

dangerous social distancing : కరోనాను కట్టడి చేయాలంటే సోషల్ డిస్టెన్స్ (భౌతిక దూరం) తప్పనిసరి అయ్యిందనే విషయం తెలిసిందే. కానీ కొన్ని భౌతిక దూరాలు ప్రమాదాలను తెచ్చిపెడతాయనే విషయం మీకు తెలుసా? అది కరోనా సమయం అయినసరే. అదేంటీ భౌతిక దూరం పాటించాలని చెబుతుంటే అది ప్రమాదమని అంటున్నారు? ఇదేం చిత్రం అని ముక్కున వేలేసుకుంటున్నారా?

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద మహేంద్రా తన ట్విట్టర్ లో షేర్ చేసిన ఈ ఫోటో చూస్తే మీరు కూడా అదే అంటారు. ఫన్నీ పిక్స్ తోను..వీడియోస్ తోను..వినూత్న ఆవిష్కరణ లు జరిపిన వ్యక్తులను అభినందిస్తూ ఆనంద్ మహేంద్రా తన ట్విట్టర్ లో పోస్టులు పెడుతుంటారనే విషయం తెలిసిందే.

అలాగే ఈసారి ఆయన ఓ ఫన్నీ పిక్ ను సరదాగా షేర్ చేశారు. అసలే ఇవి కరోనా రోజులు. సామాజిక దూరం తప్పనిసరి అయింది. కానీ ఇద్దరు వ్యక్తులు మరోరకం సామాజిక దూరాన్ని పాటించారని, అది చాలా ప్రమాదకరమైందని మహీంద్ర అంటూ..ఓ నిచ్చెనను తమ మెడలకు వేసుకుని రెండు బైకులపై వెళ్లే ఇద్దరు వ్యక్తులున్న ఫొటోను ఆయన షేర్ చేశారు. ఈ కరోనా కల్లోలంలోనూ ఈ ఫొటో తనకు నవ్వు తెప్పించిందని ఆయన అన్నారు ఆనంద్ మహేంద్రా..ఇదిగో ఈ ఫోటో చూస్తే మీరు కూడా అదే అంటారు.