Darshana Jardosh : శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో ఫుడ్ బాగుందంటూ ప్యాసింజర్ ట్వీట్.. స్పందించిన కేంద్రమంత్రి

ట్రైన్ జర్నీ చేసేవారికి శుభపరిణామం.. భోజనం విషయంలో ఇకపైన అస్సలు భయపడనక్కర్లేదట. రుచికరమైన, నాణ్యమైన ఫుడ్ దొరుకుతోందని ఓ ప్రయాణికుడు ఫోటోతో సహా పోస్ట్ చేశాడు. కేంద్రమంత్రి దానికి రిప్లై కూడా ఇచ్చారు. ఇప్పుడు ఈ న్యూస్ వైరల్ అవుతోంది.

Darshana Jardosh : ఆ మధ్యకాలం వరకూ రైళ్లలో టీ తాగాలన్నా, భోజనం చేయాలన్నా ప్రయాణికులు హడలిపోయేవారు. ఫుడ్ రుచికరంగా ఉండకపోవడంతో పాటు నాణ్యత లేని ఫుడ్ అందించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. తాజాగా శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో (Shatabdi express) భోజనం ఎంతో రుచికరంగా ఉందని వ్యక్తి చేసిన ట్వీట్‌కి కేంద్రమంత్రి (union minister) స్పందించడం ఇప్పుడు వైరల్‌గా మారింది.

Doctor Tweet Viral : 16 ఏళ్ల నాటి నిజాలు వెల్లడిస్తూ హైదరాబాద్ న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ ట్వీట్ వైరల్..

ఒకప్పుడు ట్రైన్ జర్నీలో భోజనం చేయాల్సి వస్తే  ప్రయాణికులు భయపడిపోయేవారు. రుచి, నాణ్యత లేని ఫుడ్ తింటే ఎలాంటి అనారోగ్య పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో ఆలోచించాల్సిన పరిస్థితి ఉండేది. తప్పనిసరి పరిస్థితుల్లో తిన్నా నిజంగానే ఆ తర్వాత నానా ఇబ్బందులు పడేవారు. తాజాగా రైళ్లలో, రైల్వే స్టేషన్‌లలో దొరికే ఆహారం విషయంలో నాణ్యత మెరుగుపడిందని ప్రయాణికుల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు రైల్వే అధికారులపై ప్రశంసలు కురిపిస్తున్నారు.  రీసెంట్‌గా శతాబ్ది ఎక్స్ ప్రెస్ లో ప్రయాణించిన సిన్హా (sinha) అనే ప్రయాణికుడు తాను తీసుకున్న భోజనం ఎంతగానో ఆకట్టుకుందని.. 9 సంవత్సరాల తర్వాత నిజంగా రైల్వే అందించే భోజనంలో చాలా నాణ్యత కనిపించందని ట్వీట్ చేశాడు. ట్వీట్‌తో పాటు తాను తిన్న ఫుడ్ ఫోటోను యాడ్ చేశాడు. జీరా రైస్ (jeera rice), పప్పు, ఆలూ, చికెన్, చపాతీ ఉన్న ఆ ఫోటో చూస్తే అతని మాటలు నిజమనే అనిపిస్తున్నాయి. అతని ట్వీట్ వెంటనే వైరల్ కావడంతో పాటు కేంద్రమంత్రి దర్శన జర్దోష్ (Darshana Jardosh) కూడా స్పందించారు. ట్రైన్ లో ఫుడ్ నచ్చినందుకు తాను చాలా సంతోషిస్తున్నానంటూ కామెంట్ చేశారు.

man dangerous bike stunt : ప్రియురాళ్లతో ఓ యువకుడి డేంజరస్ బైక్ స్టంట్.. ముంబయి పోలీసుల ట్వీట్

సిన్హా ట్వీట్ పై చాలామంది స్పందించారు. పూణే (pune) రైల్వే స్టేషన్‌లో కూడా రుచికరమైన ఆహారం అందిస్తున్నారని భారతీయ రైల్వేకి థ్యాంక్స్ అంటూ ఒకరు.. నాకు ఈ మార్పు కనిపిందని మరొకరు ఇలా వరుసగా కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి ప్రయాణికులకు భోజనం విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా రైల్వే చేస్తున్న కృషికి మంచి ప్రశంసలే లభిస్తున్నాయి.

ట్రెండింగ్ వార్తలు