మా నాన్న వీరుడు..దేశం కోసం ప్రాణాలిచ్చిన ఆయన మరణం మాకు గర్వం..చైనాపై ప్రతీకారం తీర్చుకోండి
భారత్- చైనా మధ్య జరిగిన ఘర్షణలో ప్రాణాలు కోల్పోయినవారిలో ఒడిశాకు చెందిన నాయబ్ సుబేదార్ నాథూరామ్ కూడా ఒకరు. గాల్వన్ లోయలో చైనా బలగాలతో జరిగిన ఘర్షణల్లో తండ్రి మరణంతో తల్లడిల్లుతూనే ధైర్యంలోనే..మానసిక్ స్థైర్యంలోనే తండ్రికి ఏమాత్రం తీసిపోని నాథూరామ్ కుమార్తె మాట్లాడుతూ..”నా తండ్రి వీరుడు..ఆయన దేశం గురించి చనిపోవటం మాకు చాలా గర్వంగా ఉంది.
రోజుకు ఎంతోమంది చనిపోతుంటారు. కానీ మా నాన్న మాత్రం దేశం కోసం..దేశ భద్రత కోసం ప్రాణాలు అర్పించారు..అందుకే మానాన్నది సాధారణ మరణం కాదు వీర మరణం అందుకు నాకు చాలా గర్వంగా ఉంది. మా నాన్నను చూసి నేను చాలా గర్వపడుతున్నాను అంటూ భావోద్వేగంతో తెలిపింది ఆ 10ఏళ్ల చిన్నారి.
అతను దేశం కోసం అమరవీరుడు అయ్యాడు. మానాన్నలా మరణించిన వీరుల మరణాలు వృథా కాకూడదు..భారత్ చైనాపై ప్రతీకారం తీర్చుకోవాలి. అప్పుడే మానాన్న ఆత్మకు శాంతి..మానాన్నలాంటి వీరుల ఆత్మలు శాంతించేలా చైనాకు గుణపాఠం నేర్పాలని నేను భారత ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నానని తెలిపింది.
ఒడిశాలోని మయూర్ భంజ్ జిల్లా చంపవుడా గ్రామానికి చెందిన నాథూరామ్ సోరెన్ వయసు 43 సంవత్సరాలు. సైన్యంలో నాయిబ్ సుబేదార్ గా పనిచేస్తున్నారు. సోరెన్ కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. నలుగురు అన్నదమ్ముల్లో సోరెన్ పెద్దవాడు.
కుటుంబ బాధ్యత అతనిపైనే ఉంది. సోరెన్ సైన్యంలో పనిచేస్తుండగా, ఆయన భార్య చంపవుడా గ్రామానికి సమీపంలోని రాయ్ రంగాపూర్ లో తన పిల్లలతో కలిసి ఉంటున్నారు. నాథూరామ్ సోరెన్ మరణంతో చంపవుడా గ్రామం అంతా విషాదం నెలకొంది.
చైనా సైన్యం జరిపిన దాడుల్లో అమరులైన వీర జవాన్లకు కన్నీటి నివాళులు అర్పిస్తున్నారు. వారి అంతిమయాత్రలో ఘనంగా నివాళులు అర్పించారు. వారి త్యాగం వృథా కాదంటునినదిస్తున్నారు.
मयूरभंज: भारत-चीन के बीच हुई झड़प में जान गंवाने वाले नायब सूबेदार नुदूराम सोरेन की बेटी-“मैं पापा पर बहुत गर्व करती हूं वो देश के लिए शहीद हुए हैं। मैं भारत सरकार से बस ये ही निवेदन करती हूं कि वो चीन से अपना बदला लें।” #Odisha pic.twitter.com/sJHKIK1vkI
— ANI_HindiNews (@AHindinews) June 18, 2020
