Amazon Sale Offers : అమెజాన్ సేల్‌లో అదిరిపోయే ఆఫర్లు.. రూ.34 వేల ఐక్యూ, రియల్‌మి ఫోన్లు రూ.18 వేలకే!
Amazon Freedom Sale : అమెజాన్ సేల్ సమయంలో ఐక్యూ, రియల్‌మి ఫోన్లపై అద్భుతమైన డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ లేటెస్ట్ ఫోన్లు భారీ తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు.. అది ఎలాగంటే?
iQOO And Realme Smartphones
- హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు కొనుగోళ్లపై అదనపు సేవింగ్
- ఐక్యూ జెడ్11 లైట్, రియల్‌మి నార్జో 100x 5జీ ఫోన్ల తగ్గింపు
- అమెజాన్ సేల్‌లో మరెన్నో బ్యాంక్ ఆఫర్లు పొందొచ్చు
Amazon Sale Offers : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్‌లో అనేక స్మార్ట్ఫోన్లు భారీ తగ్గింపు ధరకే లభిస్తున్నాయి. అందులో ఐక్యూ జెడ్11 లైట్ ఫోన్ ఒకటి. ఈ ఫోన్ 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్‌తో అనేక అద్భుతమైన ఫీచర్లను అందిస్తుంది.
ఈ ఫోన్లో డైమెన్సిటీ 6300 చిప్సెట్ అమర్చారు. అమెజాన్ సేల్‌లో అసలు ధర కన్నా చాలా తక్కువకే లభిస్తోంది. ఈ ఫోన్‌పై అదిరే డిస్కౌంట్ ఆఫర్ ఉంది. ఈ ఆఫర్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఐక్యూ జెడ్11 లైట్ అమెజాన్ ఆఫర్ :
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ సందర్భంగా ఐక్యూ జెడ్11 లైట్‌ను భారీ తగ్గింపుతో అందిస్తోంది. ఈ ఫోన్ 43శాతం తగ్గింపుతో లభిస్తోంది. అసలు ధర రూ.33,999 ఉండగా అమెజాన్ సేల్ సమయంలో రూ.17,999కే సొంతం చేసుకోవచ్చు. ఇందులో బ్యాంక్ ఆఫర్లు ఉన్నాయి. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో కొనే కస్టమర్లు నేరుగా రూ.1,250 ఆదా చేసుకోవచ్చు.
రియల్‌మి నార్జో 100x 5జీ ఫోన్ :
అమెజాన్ సేల్‌లో మరో అద్భుతమైన డీల్ అందిస్తోంది. అదే.. రియల్‌మి నార్జో 100x 5జీ ఫోన్.. ఈ ఫోన్ అసలు ధర రూ. 31,999 ఉంటే రూ. 20వేల లోపే అందిస్తోంది. కానీ, సేల్ సమయంలో రూ. 19,499కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్‌పై కంపెనీ 39శాతం డిస్కౌంట్ అందిస్తోంది. ఇందులో బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్ కార్డులతో చేసే కొనుగోళ్లపై రూ. 1,530 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.
రియల్‌మి నార్జో 100x 5జీ ఫోన్ 8000mAh బ్యాటరీతో వస్తుంది. ఈ సెగ్మెంట్లో అతిపెద్ద స్మార్ట్ఫోన్లలో ఇదొకటి. 144Hz రిఫ్రెష్ రేట్ అత్యత ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ ఫోన్ 1200 నిట్స్ టాప్ బ్రైట్నెస్ను అందిస్తుంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. కంపెనీ 7 ఏళ్ల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుందని పేర్కొంది. ఈ ఫోన్లో హై రిజల్యూషన్ సపోర్ట్‌తో బ్రైట్ ఎల్సీడీ డిస్ప్లే ఉంది.
