Vijay Diwas: భారత సైనికుల దెబ్బకు 13రోజుల్లో తోకముడిచిన పాక్ సైన్యం.. బంగ్లా‌దేశ్ ప్రత్యేక దేశంగా అవతరించింది అప్పుడే..

విజయ్ దివస్.. 1971లో పాకిస్థాన్‌పై భారత్ సాధించిన అద్భుత విజయంగా గుర్తుచేసుకుంటారు. ఆనాటి భారత సైనికుల ధైర్య సాహసాలను గుర్తు చేసుకుంటూ వారికి సెల్యూట్ చేసే రోజు. ప్రతీయేటా అప్పటి భారత సైనికుల ధీరత్వాన్ని, వారి త్యాగాలను సర్మించుకుంటూ వారికి ఘనమైన నివాళులర్పిస్తారు.

Vijay Diwas: భారత సైనికుల దెబ్బకు 13రోజుల్లో తోకముడిచిన పాక్ సైన్యం.. బంగ్లా‌దేశ్ ప్రత్యేక దేశంగా అవతరించింది అప్పుడే..

India vs pakistan

Updated On : December 16, 2022 / 11:15 AM IST

Vijay Diwas: విజయ్ దివస్.. 1971లో పాకిస్థాన్‌పై భారత్ సాధించిన అద్భుత విజయంగా గుర్తుచేసుకుంటారు. ఆనాటి భారత సైనికుల ధైర్య సాహసాలను గుర్తు చేసుకుంటూ వారికి సెల్యూట్ చేసే రోజు. ప్రతీయేటా అప్పటి భారత సైనికుల ధీరత్వాన్ని, వారి త్యాగాలను సర్మించుకుంటూ వారికి ఘనమైన నివాళులర్పిస్తారు. విజయ్ దివస్ సందర్భంగా గురువారం రాత్రి ఆర్మీ హౌస్‌లో ఎట్ హోమ్ కార్యక్రమానికి ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే హాజరయ్యారు. ఈ సందర్భంగా 1971 యుద్ధంలో విజయానికి కారణమైన మన సాయుధ బలగాల పరాక్రమాన్ని భారతదేశం ఎప్పటికీ మరచిపోలేదని అన్నారు.

 

 

బంగ్లాదేశ్ ఆవిర్భావానికి దారితీసిన 1971 యుద్ధంలో పాకిస్థాన్ పై సాధించిన విజయాన్ని గుర్తుచేసుకోవడానికి ప్రతీయేటా డిసెంబర్ 16న విజయ్ దివస్‌గా జరుపుకుంటారు. అప్పట్లో తూర్పు పాకిస్థాన్ పార్టీ అవామీ లీగ్ ఎన్నికల్లో విజయం సాధించడంలో పాకిస్థాన్‌లో వివాదం చెలరేగింది. దీంతో పాకిస్థాన్లోని బెంగాలీ, హిందూ నివాసితులపై పాక్ సైన్యం దాడులకు తెగబడింది. అంతేకాదు. భారత్ కు చెందిన 11 ఎయిర్ బేస్‌లపై వైమానిక దాడులు చేసింది. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అప్పటి ఆర్మీ చీఫ్ జనరల్ శ్యామ్ మానెక్లాను పాక్ పై యుద్ధానికి ఆదేశించారు. 13రోజుల పాటు జరిగిన ఈ యుద్ధంలో భారత్ సైన్యం దెబ్బకు పాకిస్థాన్ సైన్యం తోకముడిచింది.

 

భారత్ నుండి విడిపోయిన పాకిస్థాన్ దేశంలో పశ్చిమ, తూర్పు పాకిస్థాన్‌లుగా ఉండేవి. బంగ్లా‌దేశ్‌ను అప్పటికాలంలో తూర్పు పాకిస్థాన్ అని పిలిచేవారు. తూర్పు పాకిస్థాన్ పై దురాక్రమాలను ఖండిస్తూ బెంగాలీ సైనికుులు, పారామిలిటరీ ఫోర్స్, ఈస్ట్ బెంగాల్ రెజిమెంట్, తూర్పు పాకిస్థాన్ రైఫిల్స్ పాకిస్థాన్ సైన్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి తమను తాము స్వాతంత్ర్యంగా ప్రకటించుకున్నారు. దీంతో బంగ్లా దేశ్ కొత్త దేశంగా ఆవిర్భవించడానికి, పాకిస్థాన్ యుద్ధంలో ఓడిపోవటానికి భారత్ సాయం చేసింది. 1971 డిసెంబర్ 16న యుద్ధం ముగియడంతో ఆ రోజును ప్రతీయేటా విజయ దివస్ గా భారత్ దేశం జరుపుకుంటుంది.