Intense Sun : భానుడి భగభగలు.. రాబోయే ఐదు రోజులు ఎండలు మరింత తీవ్రం

ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా దేశమంతా భానుడు తన ప్రభాతం చూపిస్తున్నాడు. ఈ క్రమంలో భారత వాతావరణ కేంద్రం ఇచ్చిన తాజా నివేదిక భయం కలిగిస్తోంది.

Intense Sun : భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. గత కొన్ని రోజులుగా సూర్యుడు భగభగ మండుతున్నాడు. దేశంలో ఎండలు మండిపోతున్నాయి. పగటిపూట పనుల కోసం బయటికి వచ్చిన జనం వేసవి తాపానికి తాళలేక విలవిల్లాడుతున్నారు. తీవ్ర ఎండలకు తోడు ఉక్కపోత కూడా జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా దేశమంతా భానుడు తన ప్రభాతం చూపిస్తున్నాడు. ఈ క్రమంలో భారత వాతావరణ కేంద్రం ఇచ్చిన తాజా నివేదిక భయం కలిగిస్తోంది.

రాబోయే ఐదు రోజుల పాటు దేశంలో పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరుగన్నాయని ఐఎండీ వెల్లడించింది. దేశంలోని పశ్చిమ, మధ్య, తూర్పు ప్రాంతాలతోపాటు వాయివ్యంలోని కొన్ని చోట్ల 2 నుంచి 4 డిగ్రీ సెంటీగ్రేడ్ ల వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని ఐఎండీ తెలిపింది. రాబోయే రెండు రోజుల్లో మధ్యప్రదేశ్, ఒడిశా మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ లలో ఉరుములు, బలమైన గాలులు కూడా వీస్తాయని వాతావరణ శాఖ అంచనా.

Heat Wave Alert : దేశంలో భానుడి భగభగ.. వడగాలుల తీవ్రత పెరగొచ్చు : ఐఎండీ హెచ్చరిక!

బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్, హర్యానాలోని పలు ప్రాంతాల్లో వడగాలులు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని ఐఎండీ డైరెక్టర్
జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర వెల్లడించారు. వాతావరణ మార్పు ప్రపంచ ఉష్ణోగ్రతలను పెంచుతోందని తెలిపింది. తీవ్రమైన వాతావరణ సంఘటనల ఫ్రీక్వెన్సీ, తీవ్రతను మరింత దిగజార్చుతోందని పేర్కొంది.

ఐఎండీ నివేదిక ప్రకారం ఏప్రిల్ నెల ప్రారంభంలో దేశంలోని అనేక ప్రాంతాలు, వాయువ్య, ద్వీపకల్ప
ప్రాంతాన్ని మినహాయించి, ఏప్రిల్ నుంచి జూన్ వరకు సాధారణం కంటే ఎక్కువ గరిష్ణ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఒడిశా, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ప్రస్తుతం 38 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ గా నమోదవుతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు