Site icon 10TV Telugu

మోడీని విమర్శించిన జార్ఖండ్ సీఎంకి జగన్ కౌంటర్

Hemant Soren

Hemant Soren

Hemant Soren కరోనా కట్టడి విషయంలో ప్రధాని నరేంద్రమోడీ వైఖరిపై కొద్ది రోజులుగా విపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు ఎక్కుపెడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రధాని మోడీ లక్ష్యంగా జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ వ్యాఖ్యలు చేయగా..ఇటువంటి సమయంలో ఈ వ్యాఖ్యలు తగదంటూ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి హేమంత్ సోరెన్ కి హితవు పలికారు.

అసలేం జరిగింది
ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ఏపీ,జార్ఖండ్,తెలంగాణ,ఒడిషా సీఎంలతో ఫోన్ లో మాట్లాడారు. కరోనా మహమ్మారి పరిస్థితిపై సీఎంలతో మోడీ చర్చించారు. ఈ చర్చలపై జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. అయితే ప్రధాని మోడీ ఫోన్ కాల్ తర్వాత జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో… ఈ రోజు గౌరవనీయులైన ప్రధానమంత్రి ఫోన్ చేశారు. ఆయన తన “మన్ కి బాత్ “మాత్రమే మాట్లాడారు. అలా కాకుండా పరిస్థితుల గురించి మాట్లాడి, ఆ తరువాత సమస్యల గురించి అడిగి తెలుసుకుంటే బాగుండేది అని హేమంత్ సోరెన్ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రధాని తాను మాత్రమే మాట్లాడారని, ఎదుటి వ్యక్తిని మాట్లాడనివ్వలేదని అన్నారు. రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను ప్రధాని మోడీతో చర్చించడానికి అనుమతించనందుకు సోరెన్ అసంతృప్తితో ఉన్నన్నారని అధికారిక వర్గాలు చెబుతున్నాయి.

జార్ఖండ్ సీఎం ట్వీట్ పై ఏపీ సీఎం
హేమంత్ సోరెన్ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతున్న సమయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ శుక్రవారం వరుస ట్వీట్ లు చేశారు. జగన్ తన ట్వీట్ లో…మీ పట్ల నాకు ఎంతో గౌరవం ఉంది.. కానీ ఒక సోదరుడిగా మిమ్మల్ని కోరేదేంటంటే, మన మధ్య విభేదాలు ఎన్నున్నా ఈ సమయంలో రాజకీయాలు చేయడం దేశాన్ని బలహీనపరుస్తుందని జార్ఖండ్ సీఎంకి సూచించారు. ఆ వెంటనే మరో ట్వీట్‌ చేసిన జగన్…ప్రస్తుతం కోవిడ్ -19కి వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధంలో, మహమ్మారిని సమర్థవంవంతంగా ఎదుర్కొనే విషయంలో వేలెత్తి చూపించడం మానీ ప్రధానికి అండగా వుందామని హేమంత్ సోరెన్ కి జగన్ హితవు పలికారు.

మరోవైపు, హేమంత్ సోరెన్ సీఎం పదవి పరువు తీశారని, తన వైపల్యాల నుంచి దృష్టి మరల్చేందుకు ఇలాంటి చవకబారు ఎత్తుగడలకు పాల్పడుతున్నారని అసోం బీజేపీ నేత హిమంత బిస్వాల్, జార్ఖండ్ బీజేపీ నేత బాబూలాల్ మరాండి తదితరులు దుమ్మెత్తిపోశారు.

Exit mobile version