IAF
IAF-32 aircraft : 2016వ సంవత్సరంలో బంగాళాఖాతంలో గల్లంతైన భారత వైమానిక దళానికి చెందిన ఏఎన్-32 విమానం శిథిలాలు చెన్నై తీరానికి 310 కిలోమీటర్ల దూరంలో కనుగొన్నారు. ఈ విమానంలో 29 మంది సిబ్బంది ఉన్నారు. చెన్నై తీరానికి 310 కిలోమీటర్ల దూరంలో సముద్రగర్భంలో కూలిపోయిన విమాన శిధిలాలను చిత్రీకరించారు. 2016వ సంవత్సరం జులై 22వతేదీన ఉదయం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 32 విమానం తాంబరం ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి బయలు దేరింది.
ALSO READ : 2000 Flights Cancelled : అమెరికాలో మంచు తుపాన్ ఎఫెక్ట్ : 2వేల విమాన సర్వీసుల రద్దు
అండమాన్ నికోబార్ దీవులలోని పోర్ట్ బ్లెయిర్‌కు వారానికోసారి పర్యటనకు వచ్చిన రవాణా విమానంలో సిబ్బందితో సహా 29 మంది ఉన్నారు. ఈ విమానం చెన్నై నుంచి ఉదయం 8 గంటలకు బయలుదేరింది. పోర్ట్ బ్లెయిర్‌లోని భారత నౌకాదళ ఎయిర్ స్టేషన్ అయిన ఐఎన్ఎస్ ఉత్క్రోష్‌లో ల్యాండ్ కావాల్సి ఉంది.
ALSO READ : Today Headlines : జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళ సజీవదహనం
బయలుదేరిన కొద్దిసేపటికే విమానం బంగాళాఖాతం మీదుగా ఉన్నప్పుడు రాడార్ నుంచి అన్ని సంబంధాలను కోల్పోయి అదృశ్యమైంది. సముద్రంపై తప్పిపోయిన విమానం కోసం సాయుధ దళాలు గాలించాయి. వైమానిక దళం తప్పిపోయిన విమానాన్ని గుర్తించడంలో విఫలమైంది. భారత వైమానిక దళానికి చెందిన విమానంలో ఉన్నవారిని చనిపోయినట్లు ప్రకటించారు.