2000 Flights Cancelled : అమెరికాలో మంచు తుపాన్ ఎఫెక్ట్ : 2వేల విమాన సర్వీసుల రద్దు

అమెరికా దేశాన్ని శీతాకాలపు తుపాన్ తాకడంతో రెండు వేల విమానాల రాకపోకలను రద్దు చేశారు. విమాన సర్వీసుల రద్దుతో యూఎస్ లోని పలు విమానాశ్రయాల్లో ప్రయాణికులు చిక్కుకుపోయారు.....

2000 Flights Cancelled : అమెరికాలో మంచు తుపాన్ ఎఫెక్ట్ : 2వేల విమాన సర్వీసుల రద్దు

Flights Cancelled

Updated On : January 13, 2024 / 6:25 AM IST

2000 Flights Cancelled : అమెరికా దేశాన్ని శీతాకాలపు తుపాన్ తాకడంతో రెండు వేల విమానాల రాకపోకలను రద్దు చేశారు. విమాన సర్వీసుల రద్దుతో యూఎస్ లోని పలు విమానాశ్రయాల్లో ప్రయాణికులు చిక్కుకుపోయారు. తుపాను కారణంగా మిడ్ వెస్ట్, సౌత్ లో ఇప్పటివరకు 2000 కంటే ఎక్కువ విమాన సర్వీసులను రద్దు చేశారు. తుపాన్ వల్ల మరో 2400 విమానాలు ఆలస్యంగా రాకపోకలు సాగించాయి. చికాగోలోని ఓ’హేర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో40 శాతం విమానాలను రద్దు చేశారు.

ALSO READ : టీడీపీ అభ్యర్థి ఎవరు? ఉత్కంఠ రేపుతున్న పెనమలూరు రాజకీయం

డెన్వర్ ఇంటర్నేషనల్, మిల్వాకీ మిచెల్ ఇంటర్నేషనల్ విమానాశ్రయాలు తుపాన్ వల్ల ప్రభావితమయ్యాయి. ఈ వారంలో ప్రతిరోజూ 200 కంటే ఎక్కువ యునైటెడ్, అలాస్కా ఎయిర్‌లైన్స్ విమానాలు రద్దు చేశారు. ఫ్లైట్ ఎవేర్ 737 మ్యాక్స్ 9 విమానాలను రద్దు చేశారు. తుపాన్ వల్ల ఉరుములు, మెరుపులతో కూడి మంచు తుపాన్ వల్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం వాటిల్లింది.

ALSO READ : ఇటు వైసీపీ కీలక నేతలకు గాలం, అటు గ్రూపు తగాదాలు పరిష్కారం‌.. ఎన్నికల వేళ చంద్రబాబు అదిరిపోయే వ్యూహం

శుక్రవారం ఉదయం నాటికి గ్రేట్ లేక్స్,సౌత్‌లో 250,000 గృహాలు,వ్యాపార సంస్థలకు విద్యుత్ సరఫరా లేదు. ఇల్లినాయిస్, చికాగోలో గంటకు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. అర్కాన్సాస్‌లో గంటకు 74 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. తీవ్రమైన తుపాన్ గాలుల ప్రభావం వల్ల 19వ శతాబ్దానికి చెందిన మైనేలోని ఒక ఐకానిక్ స్టేట్ ల్యాండ్‌మార్క్‌కు తీవ్ర నష్టం కలిగింది.