Today Headlines : సంక్రాంతి వేళ నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్
అర్హత ఉన్న నిరుద్యోగులు డీఎస్సీ నోటిఫికేషన్‌ను వినియోగించుకోవాలని బొత్స సత్యనారాయణ చెప్పారు. సీఎం వైఎస్ జగన్‌తో మెగా డీఎస్సీ గురించి చర్చించామన్నారు. పోస్టుల సంఖ్య, భర్తీపై త్వరలోనే పూర్తి వివరాలు తెలియజేస్తామని చెప్పారు.

Today Headlines in Telugu at 11PM
సంక్రాంతి వేళ నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్
సంక్రాంతి వేళ ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ పండుగ తర్వాత మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటిస్తామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న బొత్స సత్యనారాయణకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మీడియా సమావేశంలో మాట్లాడారు. అర్హత ఉన్న నిరుద్యోగులు డీఎస్సీ నోటిఫికేషన్‌ను వినియోగించుకోవాలని చెప్పారు. సీఎం వైఎస్ జగన్‌తో మెగా డీఎస్సీ గురించి చర్చించామన్నారు. పోస్టుల సంఖ్య, భర్తీపై త్వరలోనే పూర్తి వివరాలు తెలియజేస్తామని చెప్పారు.
చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ
ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో నారా లోకేశ్, నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు.
ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
ఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు, ఖాళీగా ఉన్న మంత్రి పదవుల అంశాలపై ఖర్గేతో రేవంత్ రెడ్డి చర్చించారు. ఇవాళ మధ్యాహ్నం కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్‌తోనూ రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జ్ దీపదాస్ మున్షి కూడా పాల్గొన్నారు.
వైసీపీకి ఎంపీ వల్లభనేని బాలశౌరి రాజీనామా
వైసీపీకి మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి రాజీనామా చేశారు. జనసేన పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. బాలశౌరి కొంత కాలంగా నియోజకవర్గానికి, వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
ఉత్తమ్ కుమార్‌రెడ్డి సమీక్ష
హైదరాబాద్‌లోని జలసౌధలో తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులకు కొత్త ఆయకట్టుకు సాగునీరు ఇచ్చే ప్రణాళికలపై ఆయన పలు సూచనలు చేశారు. గత బీఆర్ఎస్ సర్కారు నీటిపారుదల శాఖలో అప్పులు బాగా చేసిందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో తప్పిదాలపై విజిలెన్స్ విచారణ ప్రారంభమైందన్నారు.
పొదల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. 10 మందికి గాయాలు
వికారాబాద్ నుంచి తాండూరుకు వెళ్తున్న ఓ టీఎస్‌ఆర్టీసీ బస్సు అనంతగిరి కొండల్లో పొదల్లోకి దూసుకెళ్లింది. దీంతో 10 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. బస్సులో దాదాపు 100 మంది ప్రయాణికులు ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
సీఐడీ కార్యాలయంలో చంద్రబాబు నాయుడు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శనివారం మధ్యాహ్నం విజయవాడ తులసి నగర్ లోని సీఐడీ కార్యాలయంకు చేరుకున్నారు. చంద్రబాబు నాయుడును చూసిన వెంటనే జైబాబు జైజై బాబు అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. సీఐడీ కార్యాలయం లోపలికి వచ్చేందుకు బారికేడ్లను దాటి టీడీపీ కార్యకర్తలు ప్రయత్నించడంతో పోలీసులు వారించారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట, వాగ్వావాదం చోటు చేసుకుంది. కాగా, సీఐడీ కార్యాలయం నుంచి చంద్రబాబు తాడేపల్లిలోని సిట్ ఆఫీసుకు వచ్చారు.
ఎమ్మెల్యే తోపుదుర్తి బెదిరిస్తున్నారు..
వైసీపీపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లను ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి బెదిరిస్తున్నారని, దీనిపై సీఎం జగన్ ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. అనంతపురంలో రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. ప్రకాశ్‌రెడ్డి ఓ గుత్తేదారుని బెదిరించారని అన్నారు. కూలీలను అపహరించినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపణలు చేశారు.
స్వస్థలానికి రఘురామ ..
ఎంపీ రఘురామకృష్ణరాజు నాలుగేళ్ల తరువాత స్వస్థలానికి చేరుకున్నారు. ఢిల్లీ నుంచి నేరుగా రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు కుటుంబ సభ్యులు, అభిమానులు భారీగా తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా ర్యాలీగా భీమవరం బయలుదేరారు.
నాల్గోసారి సమన్లు..
ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ కు ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. ఢిల్లీ మద్యం కేసులో మనీలాండరింగ్ కు సంబంధించి ఈనెల 18న విచారణకు హాజరు కావాలని పేర్కొంది. ఇప్పటికే కేజ్రీవాల్ కు ఈడీ మూడుసార్లు సమన్లు ఇచ్చిన విషయం తెలిసిందే. కేజ్రీవాల్ ఈడీ విచారణకు హాజరుకాకపోవటంతో నాల్గోసారి ఈడీ సమన్లు జారీ చేసింది.
ఏసుదాస్ కు సమున్నత గౌరవం..
ప్రముఖ గాయకుడు, హరివరాసనం అవార్డు గ్రహీత కె.జె. ఏసుదాస్ పుట్టినరోజు సందర్భంగా కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) ప్రత్యేక పూజలు నిర్వహించింది.