Maha vs Karnataka: మాకు కాదు, వారికి కాదు.. కర్ణాటకతో సరిహద్దు వివాదంపై శివసేన వింత డిమాండ్

వివాదాస్పద బెళగావి ప్రాంతాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలంటూ మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సోమవారం డిమాండ్ చేశారు. ఈ వివాదంపై ఇప్పటికే చొరవ తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. కేంద్ర పాలిత ప్రాంతంగా గుర్తిస్తేనే వివాదం చల్లబడుతుందని ఉద్ధవ్ అన్నారు. ఈ విషయమై ఉద్ధవ్ మాట్లాడుతూ ‘‘మాకు కర్ణాటకకు చెందిన అంగుళం భూమి కూడా అక్కర్లేదు. కానీ మా భూభాగం మాకు కావాలి.

Declare disputed Maharashtra-Karnataka border as Union Territory demanded by Shivsena

Maha vs Karnataka: మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న వివాదం మరో స్థాయికి వెళ్లేలా కనిపిస్తోంది. శివసేన (ఉద్ధవ్ థాకరే) చేసిన తాజా డిమాండ్ ఈ వివాదాన్ని ఇంకేదో మలుపు తిప్పేట్టుందనే అనుమానాల్ని రేకెత్తిస్తుంది. వాస్తవానికి నిన్నటి వరకు అది తమకే చెందుతుందని, అవసరమైతే చైనా తరహాలో కర్ణాటకలో అడుగు పెడతామని బెదిరింపులకు పాల్పడ్డ శివసేన.. తాజాగా వివాదాస్పద ప్రాంతం అటు కర్ణాటకకు కాకుండా ఇటు మహారాష్ట్రకు చెందకుండా ఒక వింత డిమాండ్ కేంద్రం ముందు ఉంచింది.

Nirmala Sitharaman: ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్

వివాదాస్పద బెళగావి ప్రాంతాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలంటూ మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సోమవారం డిమాండ్ చేశారు. ఈ వివాదంపై ఇప్పటికే చొరవ తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. కేంద్ర పాలిత ప్రాంతంగా గుర్తిస్తేనే వివాదం చల్లబడుతుందని ఉద్ధవ్ అన్నారు. ఈ విషయమై ఉద్ధవ్ మాట్లాడుతూ ‘‘మాకు కర్ణాటకకు చెందిన అంగుళం భూమి కూడా అక్కర్లేదు. కానీ మా భూభాగం మాకు కావాలి. మహారాష్ట్ర నుంచి కర్ణాటక ఆక్రమించిన భూమిని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని నేను కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఈ విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని అసెంబ్లీలో ఈ రోజే తీర్మానం చేయాలి’’ అని అన్నారు.

Ukraine Drone Attack : రష్యా ఏంజిల్స్ బాంబర్ బేస్ పై యుక్రెయిన్ డ్రోన్ దాడి.. ముగ్గురు మృతి