Ukraine Drone Attack : రష్యా ఏంజిల్స్ బాంబర్ బేస్ పై యుక్రెయిన్ డ్రోన్ దాడి.. ముగ్గురు మృతి

రష్యాలో ఏంజిల్స్ బాంబర్ బేస్ పై యుక్రెయిన్ డ్రోన్ దాడికి పాల్పడింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందినట్లు రష్యా రక్షణ శాఖ పేర్కొంది. వైమానిక రక్షణ వ్యవస్థ ఆ డ్రోన్ ను కూల్చి వేసిందన్నారు.

Ukraine Drone Attack : రష్యా ఏంజిల్స్ బాంబర్ బేస్ పై యుక్రెయిన్ డ్రోన్ దాడి.. ముగ్గురు మృతి

Ukraine drone attack

Ukraine drone attack : రష్యాలో ఏంజిల్స్ బాంబర్ బేస్ పై యుక్రెయిన్ డ్రోన్ దాడికి పాల్పడింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందినట్లు రష్యా రక్షణ శాఖ పేర్కొంది. వైమానిక రక్షణ వ్యవస్థ ఆ డ్రోన్ ను కూల్చి వేసిందన్నారు. కానీ ఆ డ్రోన్ శిథిలాలు కిందపడటంతో ముగ్గురు మృతి చెందారని అధికార వర్గాలు తెలిపాయి. స్ట్రాటజిక్ బాంబర్ విమానాల బేస్ గా ఏంజిల్స్ విమానాశ్రయం పని చేస్తోంది.

Pakistan To Ukraine Supply Arms : యుక్రెయిన్‌కు పాకిస్థాన్ ఆయుధ సహాయం..సముద్ర మార్గంలో పంపనున్న పాక్

ఈ బేస్ బోర్డర్ కు 500 కిలో మీటర్ల దూరంలో ఉంది. లో ఆల్టిట్యూడ్ లో వెళ్తోన్న యుక్రెయిన్ డ్రోన్ ను కూల్చి వేసినట్లు రష్యా రక్షణ శాఖ వెల్లడించింది. సరటోన్ ప్రాంతంలో ఆ బేస్ ఉంది. అయితే డ్రోన్ దాడి వల్ల ప్రజలకు ఎలాంటి ప్రమాదం లేదని గవర్నర్ స్పష్టం చేశారు.