Deep Depression Intensifies Into A Cyclonic Storm
Cyclone Tauktae update :ప్రస్తుతం లక్షద్వీప్ లో కేంద్రీకృతమై ఉన్న తౌక్తా తుఫాను శనివారం ఉదయం తీవ్ర తుఫానుగా ముదిరిందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) తెలిపింది. టౌక్టె తుఫాను రాబోయే 24 గంటల్లో మరింత తీవ్రమైన తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మే 18 నాటికి ఉత్తర-వాయువ్య దిశగా పయనించి గుజరాత్ తీరాన్ని తాకే అవకాశం ఉందని వెల్లడించింది.
ముందుజాగ్రత్త చర్యగా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే తుఫానుపై అధికారులు అప్రమత్తం చేశారు.. ఎదుర్కోవడానికి సర్వ సన్నద్ధంగా ఉండాలని ఆదేశించారు. టౌక్టె తుఫాను ప్రభావం కనిపించే అవకాశం ఉన్న పాల్ఘర్, రాయ్‌గడ్, రత్నగిరి, సింధుదుర్గ్ జిల్లాల్లో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఉద్ధవ్ ఠాక్రే అధికారులను ఆదేశించారు.
ఇదిలావుండగా, మహారాష్ట్ర, గుజరాత్, కేరళ, తమిళనాడు, కర్ణాటక తీరాలను తాకే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందుగానే సిద్ధంగా ఉన్నామని జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డిఆర్‌ఎఫ్) అధికారులు తెలిపారు.