ఫోటోలు: ఎన్‌సీబీ కార్యాలయానికి చేరుకున్న హీరోయిన్ దీపికా పదుకొనే

  • Published By: vamsi ,Published On : September 26, 2020 / 12:14 PM IST
ఫోటోలు: ఎన్‌సీబీ కార్యాలయానికి చేరుకున్న హీరోయిన్ దీపికా పదుకొనే

Updated On : September 26, 2020 / 12:22 PM IST

బాలీవుడ్‌లో డ్రగ్స్ కల్లోలం కొనసాగుతూ ఉండగా.. ప్రతిరోజు ఒకరుగా సెలబ్రిటీలు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కార్యాలయానికి చేరుకుని ఎన్‌సీబీ అధికారుల ముందు విచారణకు హాజరవుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే రకుల్‌ప్రీత్ సింగ్‌తో సహా పలువురు విచారణకు హాజరవగా.. లేటెస్ట్‌గా డ్రగ్స్ కేసులో హీరోయిన్ దీపిక పదుకొనే ప్రశ్నలను ఎదుర్కోంటుంది.
డ్రగ్స్ కేసు విచారణకు సంబంధించి నటి దీపికా పదుకొనే ఎన్‌సీబీ కార్యాలయానికి చేరుకున్నారు. ఉదయం 10 గంటలకు ముందే దీపిక ఎన్‌సిబి కార్యాలయానికి చేరుకుంది.




నటి దీపికా పదుకొనే రాత్రి ఒక హోటల్‌లో బస చేశారు. ఎన్‌సిబి కార్యాలయానికి నేరుగా హోటల్ నుంచి చేరుకున్నారు.

ఎన్‌సీబీ గెస్ట్‌హౌస్‌లో దీపికా పదుకొనేపై విచారణ ప్రారంభించారు. డ్రగ్స్ కేసుకు సంబంధించి ఎన్‌సీబీ ఆమెను చాలా ముఖ్యమైన ప్రశ్నలు అడగవచ్చు.

ఎదురెదురుగా కూర్చోబెట్టి దీపికా పదుకొనే, ఆమె టాలెంట్ మేనేజర్ కరిష్మా ప్రకాష్‌ను ఎన్‌సీబీ విచారించే అవకాశం కనిపిస్తుంది. దీపిక మరియు కరిష్మా చేసిన చాట్ వైరల్ అవగా.. దీనిపై ఎన్‌సీబీ ఇద్దరిని విచారిస్తుంది.



దీపికా పదుకొనే, ఆమె భర్త రణ్‌వీర్ సింగ్ న్యాయవాదుల బృందాన్ని ఫైవ్ స్టార్ హోటల్‌లో కలిశారు. ఎన్‌సీబీ ప్రశ్నించే ముందు ఆమె న్యాయవాదులతో చర్చించినట్లుగా భావిస్తున్నారు.

ఈ రోజు ఎన్‌సీబీ సారా అలీ ఖాన్ మరియు శ్రద్ధా కపూర్లను కూడా విచారించబోతుంది. ఈ కేసులో ఇంకా చాలా పేర్లు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది.