భారత్ కీ లక్ష్మీ బ్రాండ్ అంబాసిడర్లుగా పీవీ సింధు,దీపికా

  • Published By: venkaiahnaidu ,Published On : October 22, 2019 / 12:48 PM IST
భారత్ కీ లక్ష్మీ బ్రాండ్ అంబాసిడర్లుగా పీవీ సింధు,దీపికా

Updated On : October 22, 2019 / 12:48 PM IST

భారత్ కీ లక్ష్మి కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్లుగా స్టార్ షట్లర్ పీవీ సింధు, ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొనే, స్టార్ షట్లర్ పీవీ సింధు నియమితులయ్యారు. ప్రధాని మోడీ నేతృత్వంలో మహిళా సాధికారతను, మహిళల కృషిని చాటే ఉద్దేశంతో భారత్ కీ లక్ష్మి హ్యాష్‌ట్యాగ్‌తో దీపికాపదుకొనే, పీవీ సింధు ఓ వీడియో రూపొందించారు. అనాథలకు అమ్మగా పేరున్న ప్రముఖ సామాజిక కార్యకర్త సింధుతై సప్కాల్ లాంటి వారిని గుర్తు చేస్తూ..ఇలాంటి లక్ష్మిలు ఉన్న ప్రతీ ఇంట్లో సుఖసంతోషాలు కలుగుతాయని వీడియోలో పీవీ సింధు, దీపికా పదుకొనే చెప్పారు.

 ఈ వీడియోను మోడీ తన ట్విట్టర్ లో షేర్ చేశారు. ఈ దీపావళి సందర్భంగా భారత్ కీ లక్ష్మి కార్యక్రమాన్ని చేపడుతున్నాం. వివిధ రంగాల్లో అత్యున్నత శిఖరాలు చేరుకున్న అమ్మాయిలను గౌరవించుకునేలా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని ప్రధాని నరేంద్రమోదీ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దీపావళి పండుగ రోజు ప్రతీ ఇంట లక్ష్మీదేవత కొలువుదీరి సుఖసంతోషాలు కలుగుతాయని ప్రజలు విశ్వసిస్తారని ప్రధాని అన్నారు.

భారతదేశపు నారీ శక్తి ప్రతిభ, చిత్తశుద్ధి, సంకల్పం మరియు అంకితభావాన్ని సూచిస్తుందని ఆయన అన్నారు. మహిళా సాధికారత కోసం కృషి చేయమని మన  నీతి ఎల్లప్పుడూ మనకు నేర్పిందని మోడీ తెలిపారు. సింధు,దీపాకా పదుకుణే ఈ వీడియో ద్వారా భారత్ కీ లక్ష్మీ జరుపుకునే సందేశాన్ని అద్భుతంగా తెలియజేవారని మోడీ మెచ్చుకున్నారు.