Pralay missiles: ప్రళయ్ బాలిస్టిక్ క్షిపణులను కొనేందుకు గ్రీన్ సిగ్నల్.. చైనా, పాక్‌ వెన్నులో వణుకు

ప్రళయ్ బాలిస్టిక్ క్షిపణులను చైనా, పాకిస్థాన్ దేశాల సరిహద్దుల్లో వాస్తవ నియంత్రణ రేఖ..

Pralay missiles

Pralay missiles- Indian Army: రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO) అభివృద్ధి చేసిన ప్రళయ్ బాలిస్టిక్ క్షిపణులను భారత ఆర్మీ కోసం కొనేందుకు చేసిన ప్రతిపాదనలకు రక్షణ శాఖ ఆమోద ముద్ర వేసింది. తాజాగా జరిగిన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది.

దీంతో దేశ సరిహద్దుల వద్ద భారత ఆర్మీకి మరింత బలం చేకూరనుంది. ప్రళయ్ బాలిస్టిక్ క్షిపణులను చైనా, పాకిస్థాన్ దేశాల సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ (LAC), నియంత్రణ రేఖ (LoC) వద్ద మోహరిస్తారు. ప్రళయ్ బాలిస్టిక్ క్షిపణులు స్వల్ప శ్రేణి లక్ష్యాలను ఛేదిస్తాయి. 150-500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ధ్వంసం చేస్తాయి.

భవిష్యత్తులో అవసరమైతే వీటి శ్రేణిని డీఆర్‌డీవో పెంచుతుంది. సంప్రదాయ యుద్ధ అస్త్రాలతో పాటు ప్రళయ్ బాలిస్టిక్ క్షిపణులను ఆర్మీ వ్యూహాత్మకంగా మోహరిస్తుంది. భారత వాయుసేన విషయంలోనూ ఇటువంటి మరో ప్రతిపాదనకు కూడా రక్షణ శాఖ ఇటీవలే ఆమోదం తెలిపింది.

దేశ రక్షణ వ్యవస్థలో వ్యూహాత్మకంగా క్షిపణులను వాడడానికి పాలసీని రూపొందించడం భద్రత విషయంలో చాలా ప్రాధాన్య అంశమని నిపుణులు అంటున్నారు. చైనా, పాకిస్థాన్ దేశాల వ్యూహాత్మక ప్రణాళికలో ఇప్పటికే క్షిపణుల మోహరింపు అంశం ఉంది. ప్రళయ్ బాలిస్టిక్ క్షిపణుల వ్యవస్థను 2015 నుంచి అభివృద్ధి చేస్తున్నారు. గత ఏడాది డిసెంబరు 21, 22 తేదీల్లో ఈ క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు. భూతలం నుంచి భూతలంలోని లక్ష్యాలను ఛేదించేందుకు వీడిని వాడతారు.

Mumbai : EMI గుర్తు చేసేందుకు చాక్లెట్లు ఇస్తున్న SBI.. పైలట్ దశలో కొత్త విధానం