Delhi Airport: ఢిల్లీలో విమాన రాకపోకలకు స్వల్ప అంతరాయం

ఇండిగో ఎయిర్‌లైన్స్ కూడా ఢిల్లీ నుంచి ప్రయాణించే ప్రయాణీకులకు అడ్వయిజరీ జారీ చేసింది.

Delhi Airport

ఢిల్లీని కాలుష్యం, పొగమంచు కమ్మేసింది. ఢిల్లీ ఎయిర్ పోర్టులో విజబిలిటీ పడిపోవడంతో విమాన రాకపోకలకు స్వల్ప అంతరాయం కలిగింది. విమాన ప్రయాణికులకు జీఎంఆర్ ఎయిర్ పోర్ట్ అడ్వయిజరీ జారీ చేసింది.

విమాన సర్వీసులు ఆలస్యం, రీషెడ్యూల్ సమయంపై విమానయాన సంస్థలను సంప్రదించాలని ప్రయాణికులకు సూచించింది. ఢిల్లీ ఎన్సీఆర్‌లో పూర్ కేటగిరీలో కొనసాగుతోంది వాయు నాణ్యత. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పై 334 పాయింట్లుగా వాయు నాణ్యత ఉంది.

సివియర్ ప్లస్ కేటగిరీ నుంచి పూర్ కేటగిరీకి వాయు నాణ్యత రావడంతో గ్రాఫ్ 4 చర్యలను సడలించింది కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్. కాలుష్య నియంత్రణ కోసం ప్రస్తుతం ఢిల్లీలో గ్రాఫ్ 1,2,3 చర్యలు అమలులో ఉన్నాయి.

మరోవైపు, ఇండిగో ఎయిర్‌లైన్స్ కూడా ఢిల్లీ నుంచి ప్రయాణించే ప్రయాణీకులకు అడ్వయిజరీ జారీ చేసింది. పొగమంచు వంటి పరిస్థితులు విమాన షెడ్యూల్‌లపై ప్రభావం చూపుతాయని పేర్కొంది.

విమానాశ్రయానికి వెళ్లే ముందు.. సమయానికి సర్వీసులు అందుబాటులో ఉన్నాయా? అన్న విషయం గురించి తెలుసుకోవాలని చెప్పింది. అందుకు తగ్గట్టు విమానాశ్రయానికి రావాలని తెలిపింది.

అఫ్ఘానిస్థాన్‌లో పాకిస్థాన్ వైమానిక దాడులు.. 15 మంది మృతి.. ప్రతీకారం తీర్చుకుంటామన్న తాలిబన్‌ సర్కారు