అఫ్ఘానిస్థాన్‌లో పాకిస్థాన్ వైమానిక దాడులు.. 15 మంది మృతి.. ప్రతీకారం తీర్చుకుంటామన్న తాలిబన్‌ సర్కారు

మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

అఫ్ఘానిస్థాన్‌లో పాకిస్థాన్ వైమానిక దాడులు.. 15 మంది మృతి.. ప్రతీకారం తీర్చుకుంటామన్న తాలిబన్‌ సర్కారు

Updated On : December 25, 2024 / 7:42 AM IST

అఫ్ఘానిస్థాన్‌లో పాకిస్థాన్ వైమానిక దాడులు చేసింది. దీంతో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. వారిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు కూడా ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

గత రాత్రి పాక్టికా ప్రావిన్స్‌లోని బర్మాల్ జిల్లాలోని లామన్‌ సహా ఏడు గ్రామాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. పాకిస్థాన్ జెట్ విమానాలు బాంబుల వర్షం కురిపించాయని అఫ్ఘాన్ వర్గాలు పేర్కొంటున్నాయి.

బర్మల్‌లోని ముర్గ్ బజార్ గ్రామం చాలా వరకు ధ్వంసమైందని తెలిపాయి. ఆయా ప్రాంతాల్లో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది. పాకిస్థాన్‌ జరిపిన వైమానిక దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని తాలిబాన్ రక్షణ మంత్రిత్వ శాఖ చెప్పింది.

తమ భూమి, సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడం తమకు ఉన్న చట్టబద్ధమైన హక్కు అని పేర్కొంది. పాకిస్థాన్‌ లక్ష్యంగా చేసుకున్న వారిలో వజీరిస్థానీ శరణార్థులు కూడా ఉన్నారని తెలిపింది. పాకిస్థాన్ అధికారులు ఇప్పటివరకు అధికారికంగా వైమానిక దాడిని ధ్రువీకరించలేదు.

అయితే, సరిహద్దుకు సమీపంలో ఉన్న తాలిబాన్ రహస్య స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్లు సైనిక సన్నిహిత భద్రతా వర్గాలు చెబుతున్నాయి. తెహ్రీక్-ఈ-తాలిబాన్ పాకిస్థాన్‌ ఇటీవలి కాలంలో పాక్ దళాలపై దాడులను మరింత పెంచింది. ఆ ఉగ్రవాదులకు అఫ్ఘాన్ తాలిబాన్ ఆశ్రయం కల్పిస్తోందని పాకిస్థాన్‌ ఆరోపిస్తోంది.

Gossip Garage : ఫైర్ ఎవరు? ఫ్లవర్ ఎవరు? గవర్నమెంట్ వర్సెస్ గ్లామర్ ఫీల్డ్..