Delhi Assembly Election: ఢిల్లీలో పోలింగ్.. ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు.. ఓటర్లకు కేజ్రీవాల్ కీలక సూచన

ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుండగా.. 699 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

Delhi Assembly election 2025

Delhi Assembly election 2025: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుండగా.. 699 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో 138 మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6గంటల వరకు జరగనుంది. ఉదయం నుంచే ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్దకు ఓటర్లు చేరుకున్నారు. కేంద్ర మంత్రి జయశంకర్, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సహా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఉదయాన్నే పోలింగ్ కేంద్రానికి చేరుకొని ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Also Read: Donald Trump: ‘గాజాను అమెరికా స్వాధీనం చేసుకుంటుంది’.. ఇజ్రాయెల్ ప్రధానితో భేటీ తరువాత డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన

ఢిల్లీలో మొత్తం 1.56 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 83.49శాతం పురుష ఓటర్లు కాగా.. 71.74 శాతం మహిళా ఓటర్లు ఉన్నారు. ఇందులో 25.89శాతం యువ ఓటర్లు ఉండగా.. 2.08లక్షల మంది తొలిసారి ఓటుహక్కు పొందిన వారు ఉన్నారు. 2,696 పోలింగ్ కేంద్రాల్లో 13,766 పోలింగ్ బూత్స్ ఏర్పాటు చేశారు. మూడు వేల పోలింగ్ స్టేషన్లు సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. ఒక్కో పోలింగ్ స్టేషన్ పరిధిలో 1,191 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకోకుండా పోలీసులు భారీ భద్రను ఏర్పాటు చేశారు. ఇంటి వద్ద నుంచి ఓటువేసే 85ఏళ్ల పైబడిన వారు ఫామ్ 12D ద్వారా ఓటుహక్కు వినియోగించుకునే అవకాశంను ఎన్నికల సంఘం కల్పించింది.

Also Raed: కులగణనపై తెలంగాణలో రాజకీయ దుమారం.. ఏం జరుగుతోందో తెలుసా?

ఢిల్లీలో జరుగుతున్న ఎన్నికల విధుల్లో మొత్తం 1,09,955 మంది ఉద్యోగులు పాల్గొనగా.. 68,733 మంది సిబ్బంది పోలింగ్ విధుల్లో పాల్గొంటున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠ భద్రత ఏర్పాటు చేయగా.. భద్రతా విధుల్లో కేంద్ర సాయుధ బలగాలకు చెందిన 220 కంపెనీలను మోహరించారు. మొత్తం 19వేల మంది హోమ్ గార్డు జవాన్లు, 35,626 మంది ఢిల్లీ పోలీస్ సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను భద్రపర్చేందుకు ఢిల్లీలోని 11 జిల్లాల్లో స్ట్రాంగ్ రూములు, లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు.


ఢిల్లీలో పోలింగ్ సందర్భంగా ఆమ్ ఆద్మీపార్టీ అధినేత, మాజీ సీఎం కేజ్రీవాల్ ట్విటర్ వేదికగా ఓటర్లకు కీలక విజ్ఞప్తి చేశారు. ప్రియమైన ఢిల్లీ వాసులారా.. ఈరోజు ఓటు వేసేరోజు.. మీ ఓటు కేవలం ఒక బటన్ కాదు.. అది మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు పునాది అంటూ పేర్కొన్నారు. రాజకీయ, సినీ ప్రముఖులు ఉదయాన్నే పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకొని ఓటు హక్కును వినియోగించుకున్నారు.