Delhi Blast
Delhi blast: దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక కట్టడం ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో దర్యాప్తు చేస్తున్నా కొద్దీ మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 12కు చేరింది. పలువురు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. హరియాణాలోని ఫరీదాబాద్ లో భారీగా పేలుడు పదార్థాలు లభ్యమయ్యాక డాక్టర్ సాహీన్ సయీద్, డాక్టర్ గనయీలను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అదేరోజు ఎర్రకోట సమీపంలో కారు పేలుడు జరగడంతో ఈ రెండింటిపై జరుపుతున్న విచారణలో నిర్ఘాంతపరిచే అంశాలు వెలుగు చూస్తున్నాయి.
ఢిల్లీ పేలుడుకు సంబంధించి మరో వీడియో విడుదలైంది. రద్దీగా ఉండే ట్రాఫిక్ మధ్య తెల్లటి హ్యుందాయ్ ఐ20 కారు పేలిన ఖచ్చితమైన క్షణాలకు సంబంధించి సీసీటీవీ పుటేజ్ లో రికార్డయ్యాయి. ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నెంబర్-1 సమీపంలో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ కెమెరా నుండి పొందిన పుటేజ్ ప్రకారం.. నెమ్మదిగా కదులుతున్న తెల్లటి హ్యుందాయ్ ఐటీ20 కారు ముందు వెనుకాల ఈ-రిక్షాలు, ఆటోలు, ఇతర వాహనాలు ఉన్నాయి. ఆ సమయంలో అంటే.. ఖచ్చితంగా సోమవారం సాయంత్రం 6.51గంటలకు ఈ పేలుడు జరిగింది. భారీ శబ్దంతో ఒక్కసారిగా పేలుడు జరిగినట్లు వీడియోలో చూడొచ్చు. పేలుడు దాటికి సమీపంలోని వాహనాలు మంటల్లో చిక్కుకొని దగ్దమయ్యాయి.
Also Read: Delhi blast: ఢిల్లీ బాంబు పేలుడు ఘటన.. వెలుగులోకి సంచలన విషయాలు.. పెద్ద ప్లానే బయటపడింది..
దేశంలోని అత్యంత ప్రసిద్ధ ప్రదేశాలలో ఒకటైన, ప్రధానమంత్రి వార్షిక స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం జరిగిన ప్రదేశం అయిన చారిత్రాత్మక ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం ఈ పేలుడు సంభవించింది. హర్యానాలోని ఫరీదాబాద్‌లోని అల్-ఫలాహ్ మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేసిన డాక్టర్ ఉమర్ ఉన్ నబీ పేలిన వాహనం డ్రైవర్‌గా ఉన్నాడని నిఘా అధికారులు అనుమానిస్తున్నారు.
#WATCH | Delhi | CCTV footage of the car blast near the Red Fort that claimed the lives of 8 people and injured many others.
Source: Delhi Police Sources pic.twitter.com/QeX0XK411G
— ANI (@ANI) November 12, 2025
విదేశీ మూలాలపై ఆరా..
ఢిల్లీ పేలుడు కేసును విచారణకు స్వీకరించిన ఎన్ఐఏ 10 మంది అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. నిందుతుల ఆర్థిక లావాదేవీలు, విదేశీ నిధుల మూలాలు, వారిని వెనుక నుచం నడిపిస్తున్న ప్రధాన కుట్రదారుల వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఐబీ, చీఫ్, ఎన్ఐఏ డీజీ భేటీ అయ్యారు. ఎర్రకోట పేలుడు ఒక ఘటన కాదని, పెద్ద కుట్రలో భాగమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. పేలుదు పదార్థాలు, నిధులు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకునేందుకు కూపీ లాగుతున్నారు. పేలుడు ఎలా సంభవించిందో కచ్చితంగా తెలిపే దృశ్యాలూ సీసీటీవీల్లో రికార్డు అయ్యాయి. ట్రాఫిక్ లో ఒక్కసారిగా మండే అగ్నిగోళం ఏర్పడినట్లు ఇవి చెబుతున్నాయి. అయితే, పేలుడు పదార్థాలున్న కారుతో ఎర్రకోట సమీపానికి వచ్చిన డాక్టర్ నవీ డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేత రోజు శక్తిమంతమైన పేలుళ్లకు కుట్ర పన్నినట్లు అధికారులు తెలిపారు.