Arvind Kejriwal: మనీష్ సిసోడియా పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తించారు.. వీడియో షేర్ చేసిన ఢిల్లీ సీఎం

మనీష్‌తో అనుచితంగా ప్రవర్తించే హక్కు పోలీసులకు ఉందా? అలా చేయమని పైనుంచి పోలీసులకు చెప్పారా? అంటూ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు.

Delhi CM: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు మనీష్ సిసోడియాను జైలు జీవితం గడుపుతున్న విషయం విధితమే. ఆయన్ను పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. ఈ క్రమంలో భారీ పోలీసుల భద్రత వలయంలో సిసోడియాను తీసుకెళ్లడం కనిపించింది. ఈ క్రమంలో పోలీసులు సిసోడియా పట్ల అనుచితంగా ప్రవర్తించారంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఓ వీడియోను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు.

Arvind Kejriwal: బీజేపీ సీబీఐని ఆదేశిస్తే అలాకూడా జరగొచ్చు.. సీబీఐ విచారణ హాజరుకు ముందు కేజ్రీవాల్ వీడియో సందేశం

ఈ సందర్భంగా.. మనీష్‌తో ఇలా అనుచితంగా ప్రవర్తించే హక్కు పోలీసులకు ఉందా? ఇలా చేయమని పైనుంచి పోలీసులకు చెప్పారా? అంటూ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు. తొలుత ఈ వీడియో క్లిప్‌ను తొలుత ఢిల్లీ మంత్రి అతిషి తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. రోస్ అవెన్యూ కోర్టులో పోలీసులు మనీష్ జీ‌తో దురుసుగా ప్రవర్తించారంటూ అతిషి రాశారు. ఢిల్లీ పోలీసులు మనీష్ సిసోడియా పట్ల అనుచితంగా ప్రవర్తించిన వ్యక్తిని వెంటనే సస్పెండ్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

Arvind Kejriwal : కోర్టుకు ఈడీ, సీబీఐ తప్పుడు సమాచారం.. దర్యాప్తు సంస్థల తీరుపై కేజ్రీవాల్ అసహనం

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో మనీష్ సిసోడియా చుట్టూ మరింత ఉచ్చుబిగుస్తోంది. మనీష్ జ్యుడిషియల్ కస్టడీని జూన్ 1 వరకు రోస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. ఇదిలాఉంటే మనీశ్ సిసోడియా పట్ల దురుసుగా వ్యవహరించారంటూ ఆప్ నేతలు చేస్తున్న ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు స్పందించారు. అందులో ఢిల్లీ పోలీసుల తప్పేమీ లేదని పేర్కొన్నారు. ఓ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి మీడియాతో మాట్లాడే అవకాశం లేదని, అందుకే మనీశ్ సిసోడియా మీడియాతో మాట్లాడుతుంటే మాట్లాడకుండా అడ్డుపడి ముందుకు తీసుకెళ్లారని పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు.

 

ట్రెండింగ్ వార్తలు