Arvind Kejriwal: బీజేపీ సీబీఐని ఆదేశిస్తే అలాకూడా జరగొచ్చు.. సీబీఐ విచారణ హాజరుకు ముందు కేజ్రీవాల్ వీడియో సందేశం

నన్ను 100 సార్లు సీబీఐ, ఈడీ పిలిచినా విచారణకు సహకరిస్తా. దేశంకోసం పనిచేస్తున్నా.. దేశం కోసం ప్రాణం ఇస్తా అని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వీడియో సందేశంలో చెప్పారు.

Arvind Kejriwal: బీజేపీ సీబీఐని ఆదేశిస్తే అలాకూడా జరగొచ్చు.. సీబీఐ విచారణ హాజరుకు ముందు కేజ్రీవాల్ వీడియో సందేశం

Delhi CM Arvind Kejriwal

Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Delhi CM Arvind Kejriwal) ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు (Delhi Liquor Policy Case) లో ఢిల్లీలో విచారణకు సంబంధించి సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ (CBI) ముందు ఆదివారం హాజరుకానున్నారు. ఉదయం 11గంటల సమయంలో విచారణ నిమిత్తం ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయం (CBI Headquarters) కు కేజ్రీవాల్ వెళ్లనున్నారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఢిల్లీ కేబినెట్ సహచరులు, ఆప్ ఎంపీలందరూ కేజ్రీవాల్ వెంట కార్యాలయంకు వచ్చే అవకాశం ఉంది. సీబీఐ విచారణకు హాజరయ్యే కొద్ది గంటల ముందు ఢిల్లీ సీఎం వీడియో సందేశాన్ని ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు.

Arvind Kejriwal : కోర్టుకు ఈడీ, సీబీఐ తప్పుడు సమాచారం.. దర్యాప్తు సంస్థల తీరుపై కేజ్రీవాల్ అసహనం

సీబీఐ కార్యాలయానికి వెళతానని, విచారణకు సహకరిస్తానని కేజ్రీవాల్ అన్నారు. తప్పు చేయనప్పుడు దాచడానికి ఏమి లేదు. కేజ్రీవాల్ ను అరెస్టు చేస్తామంటూ కాషాయం నేతలు గొంతుచించుకుంటున్నారు.. బీజేపీ ఎవరినైనా జైల్లో పెట్టగలదు, బీజేపీ ఆదేశిస్తే సీబీఐ ఎవరినైనా అరెస్ట్ చేయగలదు, తప్పు చేయకపోయినా అరెస్ట్ చేస్తారు అంటూ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారం ఉందన్న అహంకారంతో బీజేపీ వ్యవహరిస్తోందని కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి గురించి పట్టించుకోదు. జడ్జీలు, మీడియా, వ్యాపారులు, ఉద్యోగులు వారి మాట వినకపోతే జైల్లో పెడతారు అంటూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

Arvind Kejriwal: జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండమంటూ పార్టీ నేతలను హెచ్చరించిన అరవింద్ కేజ్రీవాల్

నేను 10ఏళ్ల క్రితం రాజకీయాల్లోకి వచ్చానని చెప్పిన కేజ్రీవాల్, దేశ ప్రజల బాగోగులు మన నేతలకు అవసరం లేదు, 24గంటలు రాజకీయాలు చేయడం, జైల్లో పెట్టడం గురించే ఆలోచిస్తారు అంటూ బీజేపీ నేతలను ఉద్దేశించి విమర్శలు చేశారు. నేను నా దేశం కోసం ప్రాణాలిస్తా, 75 ఏళ్ల స్వాతంత్రం తరువాత కూడా మన దేశం యువత ఇలా ఉండటానికి మన నేతల రాజకీయాలే కారణం అంటూ కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలో భారత్‌ను నెంబర్ 1 చేయడమే నా జీవిత లక్ష్యం అని, భారత్‌ను ఎవరు ఆపలేరని అన్నారు. ఎనిమిదేళ్ల ఢిల్లీ పాలనలో స్కూల్స్ మెరుగుపరిచా, మెహల్లా క్లినిక్స్ తెరిచా, ఉచితంగా రవాణా, విద్యుత్, నీరు ఇస్తున్నామని కేజ్రీవాల్ చెప్పారు. 30ఏళ్ల గుజరాత్ పాలన‌లో బీజేపీ చేసింది ఏమిలేదని, రాజకీయాలు చేయడం తప్ప దేశంకోసం చేసింది ఏమి లేదంటూ విమర్శించారు. నన్ను 100 సార్లు సీబీఐ, ఈడీ పిలిచినా విచారణకు సహకరిస్తానని చెప్పారు. దేశంకోసం పనిచేస్తున్నానని, దేశం కోసం ప్రాణం ఇస్తానని కేజ్రీవాల్ వీడియో సందేశంలో వెల్లడించారు.

CM Arvind Kejriwal: దేశాభివృద్ధిలో వృద్ధుల ఆశీర్వాదం కూడా అవసరమే.. ప్రధాని మోదీకి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ లేఖ ..

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్ ప్రేమయం ఉన్నట్లు ఆరోపణలు రావడంతో సీబీఐ అధికారులు రెండు రోజుల క్రితం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు విచారణకు రావాలని సమన్లు జారీ చేసిన విషయం విధితమే. ఈ క్రమంలో ఆదివారం ఆయన ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో సీబీఐ ప్రధాన కార్యాలయం వెలుపల పారామిలటరీ బలగాలతో వెయ్యి మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. నలుగురికంటే ఎక్కువ మంది గుమిగూడకుండా ఉండేలా 144 సెక్షన్ విధించారు. ఆప్ కార్యకర్తలు, మద్దతు దారులు పెద్ద సంఖ్యలో కార్యాలయం వద్దకు తరలివచ్చినా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకు వీధుల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు.