CM Arvind Kejriwal: దేశాభివృద్ధిలో వృద్ధుల ఆశీర్వాదం కూడా అవసరమే.. ప్రధాని మోదీకి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ లేఖ ..

ప్రధాని నరేంద్ర మోదీకి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాశారు. వృద్ధుల ఆశీర్వాదం లేకుండా ఏ వ్యక్తి, దేశం అభివృద్ధి చెందదనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలని కోరుతున్నట్లు ఆ లేఖలో అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు.

CM Arvind Kejriwal: దేశాభివృద్ధిలో వృద్ధుల ఆశీర్వాదం కూడా అవసరమే.. ప్రధాని మోదీకి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ లేఖ ..

Arvind Kejriwal and PM Modi

CM Arvind Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ( CM Arvind Kejriwa) ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi)కి లేఖ రాశారు. సీనియర్ సిటిజన్ల (senior citizens) కు గతంలో  రైల్వే అందించిన ఛార్జీల రాయితీలను పునరుద్దరించాలని కోరారు. కేంద్రం రూ. 45లక్షల కోట్ల బడ్జెట్ ను కలిగి ఉందని, సీనియర్ సిటిజన్లకు రాయితీని పొడిగిస్తే రూ. 1600 కోట్ల ఖర్చు అవుతుందని అన్నారు. ఈ మొత్తాన్ని సముద్రంలో నీటిబొట్టుగా పేర్కొన్న అరవింద్ కేజ్రీవాల్.. ఈ మొత్తాన్ని ఖర్చు చేయకుండా నిలిపివేస్తే ప్రభుత్వానికి పెద్దగా మిగిలే ఆదాయం ఏమీ లేదని అన్నారు. వృద్ధులకు రైల్వే ఛార్జీల్లో రాయితీలను తొలగించడం ద్వారా దేశ సంస్కృతికి విరుద్ధమైన ప్రభుత్వం పాలన సాగుతుందని, వారిని పట్టించుకోవడం లేదనే భావన సీనియర్ సిటిజన్లలో ఏర్పడుతుందని అన్నారు.

CM Arvind Kejriwal: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌పై కేజ్రీవాల్ ఫైర్.. బురద రాజకీయాలు చేస్తున్నారంటూ విమర్శ

దేశంలో వృద్ధుల ఆశీర్వాదం లేకుండా ఏ వ్యక్తి, దేశం అభివృద్ధి చెందదనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలని కోరుతున్నట్లు మోదీకి రాసిన లేఖలో అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. కరోనా ఉదృతి కంటే ముందు భారతీయ రైల్వే రైళ్లలో ప్రయాణించే సమయంలో 60ఏళ్లు పైబడిన పురుషులకు 40శాతం, 58ఏళ్లు పైబడిన మహిళలకు 50శాతం తగ్గింపు ఇచ్చింది. కరోనా సమయంలో 2020 మార్చి 20న ఈ విధానాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకుంది. దీంతో రైళ్ల ప్రయాణించే వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో రైల్వేలో సీనియర్ సిటిజన్లకు అందించే చార్జీల రాయితీని తిరిగి పునరుద్దరించాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫారసు చేసింది.

Delhi CM Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను చంపేస్తామని బెదిరింపు కాల్ ..

ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రైల్వేలో సీనియర్ సిటిజన్లకు రాయితీలను పునరుద్దరిస్తారని అందరూ భావించారు. కానీ, కేంద్ర ప్రభుత్వం ఆ మేరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ విషయంపై రైల్వే శాఖ మంత్రి గతంలో మాట్లాడుతూ.. సీనియర్ సిటిజన్లకు అందించే రాయితీని వెంటనే కొనసాగించే ఆలోచన లేదని చెప్పారు. తాజాగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రైల్వేలో సీనియర్ సిటిజన్లకు టికెట్‌లో రాయితీ కల్పించే విధానాన్ని పునరుద్దరించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.