Kejriwal Letter Modi : ఢిల్లీ కోవిడ్‌ ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌, బెడ్ల కొరత తీర్చండి.. ప్రధాని మోడీకి సీఎం కేజ్రీవాల్ లేఖ

ఢిల్లీలోని కోవిడ్‌ ఆస్పత్రుల్లో.. ఆక్సిజన్‌, బెడ్ల కొరత రోజురోజుకూ ఎక్కువవుతోంది. దీంతో అలర్ట్‌ అయిన ఢిల్లీ సర్కార్‌.. కేంద్రానికి లేఖ రాసింది.

Delhi CM Kejriwal’s letter to PM Modi  : ఢిల్లీలోని కోవిడ్‌ ఆస్పత్రుల్లో.. ఆక్సిజన్‌, బెడ్ల కొరత రోజురోజుకూ ఎక్కువవుతోంది. దీంతో అలర్ట్‌ అయిన ఢిల్లీ సర్కార్‌.. కేంద్రానికి లేఖ రాసింది. ఢిల్లీలో కోవిడ్ పరిస్థితులు, కేంద్రం సహకారంపై ప్రధాని మోడీకి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ లేఖ రాశారు.

ఢిల్లీ ఆస్పత్రుల్లో ఐసీయూ పడకలు, ఆక్సిజన్ కొరత ఉందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉన్న 10 వేల బెడ్లలో 1 వేయి 800 బెడ్లు కోవిడ్ రోగుల కోసం కేటాయించారని.. ప్రస్తుత పరిస్థితుల్లో 7 వేల బెడ్లు కోవిడ్ రోగుల కోసం కేటాయించాలన్నారు. ఆస్పత్రులకు సరిపడా ఆక్సిజన్‌ సరఫరా చేయాలని కోరారు.

మరోవైపు హాస్పిటల్స్‌కు సరిపడా ఆక్సిజన్ సరఫరా చేయాలని కోరారు. ఢిల్లీలో పరిస్థితులను ఎప్పటికప్పుడు కేంద్ర ఆరోగ్య, హోంశాఖ మంత్రులకు వివరిస్తున్నామన్న కేజ్రీవాల్‌.. కరోనాపై పోరులో కేంద్రం నుంచి ఇప్పటి వరకు సహకారం అందిందని.. ఇకపై కూడా కేంద్రం నుంచి ఇలానే సహాయం అందించాలని లేఖలో కోరారు.

ట్రెండింగ్ వార్తలు