వేలంటైన్స్ డే రోజు చెంప దెబ్బ కొట్టిందని పోలీస్ తల్లిని చంపేసిన మైనర్

వాలెంటైన్స్ డే రోజున చెంప దెబ్బ కొట్టిందని మైనర్ బాలిక తన పోలీస్ తల్లినే మట్టుబెట్టింది. బాలిక స్పెషల్ సెలబ్రేషన్ చేసుకోవడంతో విషయం తల్లికి తెలిసి చెంపదెబ్బ కొట్టింది. పగ పెంచుకున్న బాలిక పథకం ప్రకారం.. తల్లి కళ్లలో కారం కొట్టి తాడుతో కట్టేసి ఫ్రెండ్ సహాయంతో ఆమెను చంపేసింది.
ఢిల్లీ పోలీసు విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తుంది తల్లి. కూతురు చదువు కోసం ఉత్తరప్రదేశ్‌లోని ఘాజియాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముంటున్నారు. ఆమె భర్త బీహార్ లోని వైశాలి ప్రాంతంలో ఉంటాడు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో కూతురు జితేంద్ర కుమార్ అనే వ్యక్తితో సెలబ్రేట్ చేసుకున్నట్లు తల్లికి తెలిసింది.
దీంతో కూతురిని చెంప దెబ్బ కొట్టి.. జితేంద్రపై కంప్లైంట్ చేసేందుకు అతని ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో తన కొడుకు ఇంట్లో లేడని చెప్పడంతో వచ్చిన తర్వాత వాళ్ల ఇంటికి పంపాలని చెప్పి వెళ్లిపోయింది. బాలిక.. జితేంద్ర మధ్య జరిగిన సంభాషణలో ముందుగానే ప్లాన్ చేసుకున్నారు.
కళ్లలో కారం కొట్టి చెంపదెబ్బపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంది కూతురు. ఇంటికి రాగానే జితేంద్రను కూడా చెంపపై కొట్టింది తల్లి. అదే సమయంలో వంటగదిలో నుంచి కారం తీసుకొచ్చిన బాలిక తల్లి కళ్లలో కొట్టింది. వాళ్లను పట్టుకునే ప్రయత్నం చేసింది తల్లి. ఇద్దరూ కలిసి రాయితో మహిళ ముఖంపై కొట్టారు. స్సృహ కోల్పోయేంత వరకూ తాళ్లతో కట్టేశారు.
ఆ తర్వాత తల్లి స్పృహ కోల్పోయిందని పొరుగు వారిని పిలిచి చిత్రీకరించింది. హుటాహుటిన జీటీబీ హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిపారు. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న తండ్రి బాలిక, ఆమె బాయ్‌ఫ్రెండ్ అనుమానం ఉన్నట్లు చెప్పడంతో నిజాలు వెలుగులోకి వచ్చాయి.
సంవత్సరం నుంచి రిలేషన్‌షిప్‌లో ఉన్నారని మాకు చెప్పారు. వాలెంటైన్స్ డే రోజున బాలిక తల్లి వారిని కలిసి ఉన్న సమయంలో చూసి కోపగించుకుంది. ఈ విషయాలు పేర్కొంటూ బాలిక తండ్రి కంప్లైంట్ ఇచ్చాడు.