ఢిల్లీ ఎన్నికల్లో డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా వెనుకంజ

  • Publish Date - February 11, 2020 / 08:01 AM IST

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా, ఆప్ ఆధిక్యంలో దూసుకెళ్తోంది. మూడు స్థానాల్లో ఫలితాలు వెలువడగా, ఆప్ అభ్యర్థులే విజయం సాధించారు. ఈ క్రమంలో పత్పార్‌గంజ్‌ నియోజకవర్గంలో ఆప్ నేత.. డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా వెనుకబడ్డారు. బీజేపీ అభ్యర్థి రవి నేగి కంటే  మనీశ్ సిసోడియా 1427 ఓట్ల వెనుకంజలో ఉన్నారు. దీంతో ఆయన ఓటమి అంచున కొనసాగుతున్నారు. 

బీజేపీ అభ్యర్థి రవీందర్ సింగ్ నేగికి 15,271 ఓట్లు రాగా మనీశ్ సిసోడియాకు 13,844 ఓట్లు వచ్చాయి. 
కాగా..ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నప్పటి నుంచి మనీశ్ సిసోడియా,రవి నేగి నువ్వా నేనా అన్నట్లుగా కొనసాగారు. కానీ..ప్రస్తుతం మనీశ్ సిసోడియా మాత్రం రవినేగి కంటే వెనుకబడ్డారు.  
 

శీలంపూర్ లో ఆప్ అభ్యర్థి అబ్దుల్ రెహమాన్..దేవ్ లీ నియోజకవర్గంలో ఆప్ అభ్యర్థి ప్రకాశ్, సంగం విహార్ నియోజకవర్గంలో ఆప్ అభ్యర్థి మోహనియాలు విజయం సాధించారు.అలాగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దిశగా దూసుకెళ్తున్న ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు బీజేపీని తిరస్కరించారని, అభివృద్ధి మాత్రమే విజయం తెచ్చి పెడుతుందన్నారు. ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌లను ప్రజలు తిరస్కరించారని పరోక్షంగా బీజేపీపై విమర్శలు గుప్పించారు.