ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆధిక్యం కొనసాగిస్తూ విజయం దిశగా దూసుకుపోతోంది. ఆప్ పార్టీ నేతలు విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో పంజాబ్ లోని అమృత్ సర్ లో ఆప్ కార్యకర్తలు మిఠాయిలు పంచుకుంటు వేడుకలు జరుపుకుంటున్నారు.
ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు గాను..ఇప్పటి వరకూ అందిన సమచారం..ఆరు జిల్లాల్లో హవా కొనసాగిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ ..మెజారిటీ మార్క్ 36ను దాటి 57 స్థానాలకు పైగా ఆప్ ఆధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ 14 స్థానాల్లో కొనసాగుతోంది. ఎగ్జిట్ అంచనాలను నిజం చేస్తూ ఫలితాలు వెలువడుతున్నాయి. ఎన్నికల సంఘం సమాచారం ప్రకారం..ఉదయం 11.10 కౌంటింగ్ ప్రారంభమైంది. అప్పటి నుంచి వెలువడుతున్న ఫలితాల్లో ఆప్ పార్టీ తన హవాను కొనసాగిస్తోంది.
Punjab: Aam Aadmi Party workers in Amritsar celebrate as trends indicate lead for the party. #DelhiElectionResults pic.twitter.com/D7LUgACXkE
— ANI (@ANI) February 11, 2020
జెపి నడ్డా నేతృత్వంలోని బీజేపీ పార్టీ ప్రస్తుత రెండవస్థానంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ మాత్రం ఇప్పటి వరకూ కనీసం ఒక్కస్థానంలో కూడా ఆధిక్యత ప్రదర్శించలేని దుస్థితిలో ఉంది. బీజేపీ తరపున ఢీల్లీ బీజేపీ చీఫ్.. సీఎం అభ్యర్థి మనోజ్ తివారీ ఎన్నికల ఫలితాలకు బాధ్యత వహించడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
Delhi BJP Chief Manoj Tiwari: Trends indicate that there is a gap between AAP-BJP, there is still time. We are hopeful. Whatever the outcome, being the State Chief I am responsible. #DelhiElectionResults pic.twitter.com/k2G7r0OGCu
— ANI (@ANI) February 11, 2020