ఢిల్లీ ఓటర్ ఎవరు వైపు ? నేతల్లో ఉత్కంఠ

  • Publish Date - February 8, 2020 / 01:07 PM IST

ఢిల్లీ ఎన్నికలు ముగిశాయి. ఓటర్లు తీర్పునిచ్చేశారు. ఓట్లు ఈవీఎంల్లో నిక్షిప్తమయ్యాయి. అయితే..ప్రజలు ఎలాంటి తీర్పునిచ్చారనే దానిపై నేతల్లో ఉత్కంఠ నెలకొంది. తమకు అనుకూలంగా వస్తుందని కొంతమంది, కాదు..కాదు..తమకే ఓటు వేశారంటున్నారు ఇతర పార్టీలు. 2019 సార్వత్రిక ఎన్నికల అనంతరం ఢిల్లీ జరిగిన అసెంబ్లీ ఎన్నికలు తీవ్ర ఉత్కంఠను రేకేత్తిస్తున్నాయి. మరోసారి అధికారంలోకి రావాలని ఆప్, కాషాయం జెండా ఎగురవేయాలని బీజేపీ యోచిస్తోంది. 

ఫిబ్రవరి 08వ తేదీ శనివారం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఆప్, బీజేపీ పార్టీల మధ్య హోరా హోరీ పోటీ ఉంది. ఈ పార్టీకి చెందిన కీలక నేతలు విస్తృతంగా పర్యటించారు. బీజేపీ అగ్రనేతలను మోహరించి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేయగా…ఆప్‌లో మాత్రం సీఎం కేజ్రీవాల్ ఒంటరిగా అన్ని నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించారు. అప్పటికే ఆయన ఓటర్లను ఆకర్షించేందుకు పలు పథకాలను కూడా ప్రకటించేశారు. అంతేగాకుండా… ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌కు చెందిన రాజకీయ కన్సల్టెన్సీ ఐ-ప్యాక్‌(ఇండియన్‌ ప్యాక్‌)తో కేజ్రీ చేతులు కలిపారు. ఈ విషయాన్ని ఆయనే ట్విటర్‌ వేదికగా వెల్లడించారు.

* ఆప్, బీజేపీ మధ్య ప్రధాన పోటీ. 
* ఫిబ్రవరి 08వ తేదీన ఢిల్లీలో ఎన్నికలు. 
* ఫిబ్రవరి 11న ఎన్నికల ఫలితాలు. 
* ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరిగింది. క్యూ లైన్‌లో ఉన్న వారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. 
* సాయంత్రం 6 గంటల తర్వాత..ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. 
ఇండియా టుడే సర్వే : 
వెస్ట్ ఢిల్లీ (10/70) : ఆప్ 09-10 సీట్లలో విజయం సాధిస్తుందని అంచనా వేసింది. బీజేపీ కేవలం 01 స్థానం, కాంగ్రెస్ అసలు ఖాతా ఓపెన్ చేయదని వెల్లడించింది.