Rs 2000 Note: రెండు వేల రూపాయల నోట్ల మార్పిడికి ధ్రువీకరణ పత్రం తప్పనిసరా అనే విషయమై ఢిల్లీ హైకోర్టు సోమవారం తీర్పు ఇవ్వనుంది. నిజానికి గుర్తింపు కార్డు అవసరం లేకుండానే 2,000 రూపాయల నోట్ల మార్పిడికి అనుమతిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు విచారిస్తోంది.
Rahul Gandhi: కొత్త పాస్‌పోర్ట్ తీసుకున్న రాహుల్ గాంధీ.. నేడు అమెరికాకు ప్రయాణం
ఆర్‌బీఐ, ఎస్‌బీఐకి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ నేత, న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ పిటిషన్ వేశారు. 2,000 రూపాయల నోట్లను మార్చుకునేందుకు ఐడీ ప్రూఫ్‌ను తప్పనిసరి చేసేలా ఆర్‌బీఐ, ఎస్‌బీఐలను ఆదేశించాలని అశ్విని ఉపాధ్యాయ్ కోరారు. ప్రతి ఇంటికీ ఆధార్ కార్డులు, బ్యాంకు ఖాతాలు ఉన్నా కూడా గుర్తింపు అవసరం లేకుండా మార్పిడికి ఎందుకు అనుమతిస్తున్నారని అశ్విని ఉపాధ్యాయ్ వాదించారు.
TSPSC Paper leak: టీఎస్పీఎస్సీ బోర్డు పరీక్షల ప్రశ్నా పత్రాల లీకేజీ కేసులో కీలక మలుపు
దాదాపు 3.25 లక్షల కోట్ల రూపాయల 2,000 రూపాయల నోట్లు మార్పిడి జరుగుతున్నాయని, ఎలాంటి డాక్యుమెంటేషన్ లేకుండా ఇలాంటి మార్పిడిని అనుమతించడం ఇదే తొలిసారి అని వాదించారు. ఎలాంటి గుర్తింపు రుజువు లేకుండా కరెన్సీ నోట్లను మార్పిడి చేస్తుంటే ఆ నోట్లు నక్సలైట్లు ఉగ్రవాదుల చేతుల్లోకి చేరితే పెద్ద సమస్యగా మారుతుందని పిటిషనర్ వాదించారు.
Uttar Pradesh: స్నేహితుడి అంత్యక్రియలు చేసి, చివరికి అదే చితిలో దూకాడు
గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ సహా అక్రమంగా నగదు నిల్వలు చేసిన వారి అనుచరులు కూడా డాక్యుమెంటేషన్ అవసరాలు లేకపోవడాన్ని ఉపయోగించుకుంటారని, బ్యాంకులో 2,000 రూపాయల నోట్లను మార్చుకోవడానికి వెళతారని ఉపాధ్యాయ్ అన్నారు. నోట్ల మార్పిడి అంశం ద్రవ్య విధానానికి సంబంధించినదని, ఇది కోర్టు అధికార పరిధికి మించినది ఆర్‌బీఐ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. అశ్విని ఉపాధ్యాయ్ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ, దానిని కొట్టివేయాలని హైకోర్టును ఆర్బీఐ తరపు న్యాయవాది కోరారు.