Delhi High Court : భార్య దగ్గర లేనప్పుడు భర్త వేరే మహిళ వద్ద ఉండటంపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

భార్య భర్తకు ఎక్కువ కాలం దూరంగా ఉండటం క్రూరత్వం..భార్య దగ్గర లేనప్పుడు భర్త వేరే మహిళతో ఉన్న సందర్భం గురించి కీలక వ్యాఖ్యలు చేసింది.

Delhi High Court

Delhi High Court : భర్త వేరే మహిళతో ఉంటున్నాడని..అందుకే తనకు విడాకులు ఇస్తున్నాడని కానీ విడాకులు తీసుకోవటం తనకు ఇష్టం లేదని తెలిపిన భార్యకు షాకిచ్చింది ఢిల్లీ హైకోర్టు. భార్య ఎక్కువకాలం భర్తకు దగ్గర లేనప్పుడు ఆ భర్తను భార్య వేధిస్తున్నప్పుడు అతను మరో మహిళ వద్ద ఉండి ఊరట పొందటం తప్పుకాదు అంటూ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దీనికి కారణం సదరు భార్య భర్తకు దూరంగా ఉంటు అతనిపై క్రిమినల్ కేసులు పెట్టి వేధిస్తోందని అటువంటి సమయంలో అతను వేరే మహిళ వద్ద ఊరట పొంది ఉండవచ్చు అంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. సుదీర్ఘకాలంపాటు భార్య భర్తకు దూరంగా ఉండటం క్రూరత్వమని వ్యాఖ్యానించింది. కోర్టు చేసిన ఈ వ్యాఖ్యలకు సదరు మహిళ షాక్ అయ్యింది.

Uttar Pradesh : సాయం కోరి వచ్చిన వ్యక్తికి శిక్ష విధించిన ప్రభుత్వ అధికారి.. విధుల నుంచి తొలగింపు

ఈ కేసుకు సంబంధించిన దంపతులు 2005లోనే విడివిడిగా ఉంటున్నారు. ఆమె భర్త వద్దకు రాదు. పదే పదే భర్తపై క్రిమినల్ కేసులు పెడుతు ఇబ్బందులకు గురిచేస్తోంది. దీంతో సదరు భర్త ఫ్యామిలీ కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసుకున్నాడు. భార్య వేధింపులకు సంబంధించి అన్ని వివరాలు..తనపై పెట్టిన కేసుల వివరాలు కోర్టుముందుంచాడు. దీంతో ఫ్యామిలీ కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది. దీంతో తనకు ఈ విడాకులు ఇష్టంలేదని ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన విడాకులను రద్దు చేయాలని కోరుతు ఢిల్లీ హైకోర్టు మెట్టెక్కింది. తన భర్త వేరే మహిళను వివాహం చేసుకున్నాడని..అందుకే విడాకులు కోరాడని తను అతడిని వేధిస్తున్నానడం నిజం కాదని విడాకులు రద్దు చేయాలని కోరింది.

దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ సురేష్ కుమార్ కైత్, జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ ధర్మాసనం సదరు భర్తనే సమర్థించింది. ఆమె పిటిషన్‌ను కొట్టివేసిసంది. ఈ సందర్భంగా సెప్టెంబర్ 13 నాటి తీర్పులో భార్యపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. సుదీర్ఘకాలంపాటు దంపతులు వేరువేరుగా ఉండటం భార్య భర్తను, అతని కుటుంబాన్ని పట్టించుకోకుండా కేసులు పెట్టి వేధించటం క్రూరత్వమని పేర్కొంది. విడాకుల వ్యవహారం కోర్టు పరిశీలనలో ఉన్నప్పుడు భర్త మరొక మహిళతో కలిసి ఉన్నందున విడాకులు రద్దు చేయాలన్న భార్య వాదనను హైకోర్టు తోసిపుచ్చింది.

Tina Dabi, Pradeep Gawande : అమ్మానాన్నలు అయిన ఐఏఎస్ దంపతులు, పండంటి బిడ్డకు జన్మనిచ్చిన టీనాదాబీ

భర్త పట్ల, అత్తింటివారి పట్ల ఆమె అగౌరవంగా ప్రవర్తించిందని..పదే పదే క్రిమినల్‌ ఆరోపణలు చేస్తూ ఫిర్యాదులు చేస్తు భర్తకు మనశ్శాంతి లేకుండా చేసిందని ఇది సరైంది కాదని పేర్కొంది. ఇటువంటి పరిస్థితుల్లో సదరు బాధితుడు (భర్త) మరొక మహిళ వద్ద ఊరట పొంది ఉండవచ్చని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. విడాకుల పిటిషను దాఖలు చేసిన తరవాత జరిగిన పరిణామం కాబట్టి..విడాకులను రద్దు చేయాల్సిన పని లేదని స్పష్టంచేసింది. భార్య క్రూర ప్రవర్తన కారణంగా అతడికి కుటుంబ కోర్టు విడాకులు మంజూరుచేయడం సరైనదేనని ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన విడాకులను సమర్థించింది. పైగా ఈకేసులో భర్త రెండో వివాహం చేసుకున్నట్లుగా పిటీషనర్ నిరూపించలేకపోయారని దానికి సంబంధించి ఎటువంటి సాక్ష్యాధారాలు లేవని కోర్టు తెలిపింది.

 

ట్రెండింగ్ వార్తలు