వెడ్డింగ్ పార్టీలో గెస్ట్ వార్ : తాగి చిందేసారు.. తినే కంచాలు విసిరారు

వెడ్డింగ్ పార్టీ కోసం ఓ హోటల్లో గ్రాండ్ గా ఏర్పాట్లు చేశారు. అతిథులంతా వచ్చేశారు. పెళ్లికొడుకు స్నేహితులు, బంధువులు ఫుల్ జోష్ తో ఉన్నారు. వెడ్డింగ్ పార్టీలో చిందులు వేశారు.. తెగ సందడి చేశారు.. అలసిపోయారు. తినడమే మిగిలింది.

  • Published By: sreehari ,Published On : February 14, 2019 / 01:27 PM IST
వెడ్డింగ్ పార్టీలో గెస్ట్ వార్ : తాగి చిందేసారు.. తినే కంచాలు విసిరారు

వెడ్డింగ్ పార్టీ కోసం ఓ హోటల్లో గ్రాండ్ గా ఏర్పాట్లు చేశారు. అతిథులంతా వచ్చేశారు. పెళ్లికొడుకు స్నేహితులు, బంధువులు ఫుల్ జోష్ తో ఉన్నారు. వెడ్డింగ్ పార్టీలో చిందులు వేశారు.. తెగ సందడి చేశారు.. అలసిపోయారు. తినడమే మిగిలింది.

వెడ్డింగ్ పార్టీ కోసం ఓ హోటల్లో గ్రాండ్ గా ఏర్పాట్లు చేశారు. అతిథులంతా వచ్చేశారు. పెళ్లికొడుకు స్నేహితులు, బంధువులు ఫుల్ జోష్ తో ఉన్నారు. వెడ్డింగ్ పార్టీలో చిందులు వేశారు.. తెగ సందడి చేశారు.. అలసిపోయారు. తినడమే మిగిలింది. వెడ్డింగ్ పార్టీ కదా.. ఇక్కడే అతిథులకు ఫుడ్ అరెంజ్ చేశారు. వెరైటీ ఐటమ్స్ తయారుచేయించారు. ఇంతవరకూ బాగానే ఉంది. అసలు గొడవ ఇక్కడే మొదలైంది. అతిథులంతా ఫుడ్ కోసం ఎదురుచూస్తున్నారు. హోటల్ సిబ్బంది సర్వ్ చేయడం మొదలుపెట్టారు. అయితే సర్వ్ చేసే ఫుడ్ ఐటమ్స్ చల్లగా ఉన్నాయని అతిథుల కంప్లైట్. అది విన్న పెళ్లికొడుకు స్నేహితులు, బంధువులు రెచ్చిపోయారు. ఏంటి.. ఇంత నిర్లక్ష్యం.. చల్లబడిన ఫుడ్ సర్వ్ చేస్తారా? హాట్ హాట్ ఫుడ్ సర్వ్ చేయాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంతే.. ఆవేశం కట్టులు తెంచుకుంది. గొడవ మొదలైంది.. చిలికి చిలికి గాలివానలా మారినట్టు గొడవ పెద్దదైంది. అప్పటికే అంతా తాగి ఉన్నారు. హోటల్ సిబ్బందిపై వరుడి స్నేహితులు దాడి చేశారు. హోటల్ సిబ్బంది కూడా తక్కువేమి కాదు.. వాళ్లు ఎదురుదాడి చేశారు. చివరికి ఒకరిపై ఒకరు తినే కంచాలు విసురుకున్నారు. చేతికి ఏది వస్తే దాన్ని విసరేశారు. ఈ ఘటన వెస్ట్ ఢిల్లీలోని జనక్ పూరి ప్రాంతంలో పికాడిలే హోటల్లో అర్థరాత్రి సమయంలో జరిగింది. 
 

హోటల్ సిబ్బంది కూడా తమ చేతుల్లోని ట్రేలను ప్లేట్ లను అతిథులపై విసిరారు. దీంతో హోటల్ ఫర్నిచర్ ధ్వంసమైంది. ఫుడ్ ఐటమ్స్ పడిపోయాయి. హోటల్ అంతా అస్తవ్యస్తంగా మారిపోయింది. హోటల్ యాజమాన్యం వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. డీసీపీ మౌనికా భరద్వాజ్ అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. పెళ్లికొడుకు స్నేహితులు తమ హోటల్ మహిళా సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించారని ఫిర్యాదు చేశారు. వెడ్డింగ్ పార్టీ గెస్టుల దాడిలో తమ సిబ్బంది తలకు గాయాలయ్యాయని హోటల్ జనరల్ మేనేజర్ రాజేశ్ బాట్లా చెప్పారు. ముందస్తు విచారణలో భాగంగా ఇద్దరు అతిథులను, హోటల్ సిబ్బంది ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెడ్డింగ్ పార్టీకి మొత్తం 400 మంది అతిథులు హాజరు అయ్యారు. ఈ ఘటన అనంతరం వెడ్డింగ్ పార్టీ నిర్వహించే సమీప బంధువులు 50 మంది తప్ప మిగతా వారంతా వెళ్లిపోయారు. వెడ్డింగ్ పార్టీ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదే ఆ వీడియో..