Delhi Lieutenant Governor: ఐదుగురు ఆప్ నేతలపై పరువు నష్టం దవా వేసిన ఢిల్లీ ఎల్జీ.. రెండు కోట్ల నష్టపరిహారం డిమాండ్

ఢిల్లీ ఎల్జీ వినయ్ సక్సేనా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి చెందిన ఐదుగురు నాయకులపై పరువు నష్టం కేసు దాఖలు చేశారు. తనపై, తన కుటుంబంపై "తప్పుడు" ఆరోపణలు చేయకుండా ఆప్, ఆ పార్టీలోని నేతలను నిరోధించాలని ఢిల్లీ హైకోర్టును గురువారం కోరారు.

Delhi Lieutenant Governor: ఢిల్లీ ఎల్జీ వినయ్ సక్సేనా గురువారం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి చెందిన ఐదుగురు నాయకులపై పరువు నష్టం కేసు దాఖలు చేశారు. తనపై, తన కుటుంబంపై “తప్పుడు” ఆరోపణలు చేయకుండా ఆప్, ఆ పార్టీలోని నేతలను నిరోధించాలని ఢిల్లీ హైకోర్టును గురువారం కోరారు. సక్సేనా ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (కేవీఐసీ) చైర్మన్‌గా ఉన్న సమయంలో రూ.1,400 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని ఆప్ నేతలు ఆరోపించారు. ఇందుకు అభ్యంతరం చెబుతూ.. రూ.2కోట్ల నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ, ప్రణాళికాబద్ధమైన ఉద్దేశ్యంతో చట్టాన్ని అమలు చేసే సంస్థలు తీసుకుంటున్న చర్యల నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఆప్ ఈ ఆరోపణలు చేసిందని ఢిల్లీ ఎల్‌జీ కోర్టుకు తెలిపారు.

AP CM Jagan: చంద్రబాబు హైదరాబాద్‌కు లోకల్.. కుప్పంకు నాన్ లోకల్ ..

ఇంకా, ఆప్, ఆ పార్టీకి చెందిన నేతలు అతిషి, సౌరభ్ భరద్వాజ్, దుర్గేష్ పాథక్, సంజయ్ సింగ్, జాస్మిన్ షా ద్వారా సోషల్ మీడియాలో ప్రసారం చేయబడిన, ఆరోపించిన తప్పుడు, అవమానకరమైన పోస్ట్‌లు, ట్వీట్లు, వీడియోలను తొలగించడానికి ఆదేశాలు ఇవ్వాలని సక్సేనా కోర్టును కోరారు. ఆమ్ ఆద్మీ పార్టీ, ఆ పార్టీకి చెందిన ఐదుగురు నాయకుల నుండి వడ్డీతో పాటు రూ. 2 కోట్ల నష్టపరిహారం, నష్టపరిహారాన్ని కూడా చెల్లించాలని ఎల్జీ డిమాండ్ చేశారు.

Man Drinks At 75 Pubs: కుక్కలకు నిధుల సేకరణ కోసం సాహసం.. ఒక్క రోజులోనే 75 పబ్బుల్లో మందు తాగిన యువకుడు

ఎల్జీ, అతని కుటుంబ సభ్యుల ఫోటోలతో కూడిన ట్వీట్లు, రీ-ట్వీట్లు, పోస్ట్‌లు, వీడియోలు, క్యాప్షన్‌లు, ట్యాగ్‌లైన్‌లను తొలగించడం కోసం ట్విట్టర్, యూట్యూబ్ (గూగుల్ ఇంక్.)లను ఆదేశించాలని సక్సేనా తరపు న్యాయవాది హైకోర్టును అభ్యర్థించారు.

ట్రెండింగ్ వార్తలు