AP CM Jagan: చంద్రబాబు హైదరాబాద్‌కు లోకల్.. కుప్పంకు నాన్ లోకల్ ..

కుప్పంను చంద్రబాబు ఏనాడూ సొంతగడ్డగా భావించలేదని, హైదరాబాదే ముద్దు అని భావించాడని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. అందుకే సీఎం అయ్యాక హైదరాబాద్ లో ఇంద్రభవనంలాంటి ఇల్లు కట్టుకున్నాడని, కుప్పంలో సొంత ఇల్లు కాదు కదా.. ఓటు కూడా లేదని.. చంద్రబాబు హైదరాబాద్ కు లోకల్, కుప్పంకు నాన్ లోకల్ అని జగన్ ఎద్దేవా చేశారు.

AP CM Jagan: చంద్రబాబు హైదరాబాద్‌కు లోకల్.. కుప్పంకు నాన్ లోకల్ ..

YS Jagan

AP CM Jagan: మాజీ సీఎం, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. నలబై ఏళ్ల రాజకీయ జీవితంలో 33ఏళ్లు కుప్పం ఎమ్మెల్యేగా చంద్రబాబు పనిచేశారని, అలాంటి వ్యక్తి కుప్పం నుంచి తనకు కావాల్సింది తీసుకున్నాడే తప్ప చేసిందేమీ లేదని అన్నాడు. కుప్పం నియోజకవర్గంలో శుక్రవారం జగన్ పర్యటించారు. ఈ సందర్భంగా అనిమిగానిపల్లి బహిరంగ సభలో మూడో విడత వైఎస్ఆర్ చేయూత నిధులను జగన్ విడుదల చేశారు. అనంతరం జగన్ మాట్లాడుతూ.. నాలుగు పథకాల ద్వారా రాష్ట్రంలోని మహిళలకు రూ.51వేల కోట్లు ఇచ్చామని, ఈ మూడేళ్లలో మహిళలకు రూ. 1.17 లక్షల కోట్లు అందించామని అన్నారు. వచ్చే ఏడాది జనవరి నుంచి పింఛన్ ను రూ. 2,750కి పెంచుతున్నామని తెలిపారు.

Richest Cities: 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 20సంపన్న నగరాల్లో ముంబై ఉంటుంది

కుప్పంను చంద్రబాబు ఏనాడూ సొంతగడ్డగా భావించలేదని, హైదరాబాదే ముద్దు అని భావించాడని జగన్ విమర్శించారు. అందుకే సీఎం అయ్యాక హైదరాబాద్ లో ఇంద్రభవనంలాంటి ఇల్లు కట్టుకున్నాడని, కుప్పంలో సొంత ఇల్లు కాదు కదా.. ఓటు కూడా లేదని.. చంద్రబాబు హైదరాబాద్ కు లోకల్, కుప్పంకు నాన్ లోకల్ అని జగన్ ఎద్దేవా చేశారు. ఢిల్లీలో చక్రం తిప్పానని చెప్పుకునే చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు సీఎంగా ఉండికూడా తన సొంత నియోజకవర్గంలో కరువు సమస్యకు పరిష్కారం చూపించలేక పోయాడంటూ జగన్ విమర్శించారు. కుప్పానికి ఏమీ చేయలేని చేతగాని నాయకుడు చంద్రబాబు అంటూ జగన్ మండిపడ్డారు.

CM Jagan Kuppam Tour: సీఎం హోదాలో తొలిసారిగా.. నేడు చంద్రబాబు ఇలాకాలో సీఎం జగన్ పర్యటన..

2019 ఎన్నికల తర్వాత అన్ని ఎన్నికల్లోనూ క్లీన్ స్వీప్ చేశామని, కుప్పం ప్రజలు బాబు అవినీతికి వ్యతిరేకంగా ఓటేశారని అన్నారు. వైసీపీ హయాంలో కుప్పాన్ని మున్సిపాలిటీ చేశామని, ఆరు నెలల్లో హాంద్రీనీవా పనులు పూర్తిచేశామని, కలగా మిగిలిన ఆర్డీవో కార్యాలయాన్ని ఏర్పాటు చేశామని జగన్ అన్నారు. ఈ మూడేళ్లలోనే కుప్పం సిసలైన అభివృద్ధిని చూసిందని, ఎమ్మెల్సీగా ఉంటూనే భరత్ నాతో ఇన్ని మంచి పనులు చేయించాడని, భరత్ ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మంత్రిని చేస్తానంటూ జగన్ అన్నారు.