Richest Cities: 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 20సంపన్న నగరాల్లో ముంబై ఉంటుంది

2030 నాటికి అత్యధిక మిలియనీర్లు ఉన్న టాప్ 20 నగరాల జాబితాలోకి ప్రవేశించే మూడు నగరాల్లో భారతదేశ ఆర్థిక రాజధాని ముంబై కూడా ఒకటి అని లండన్‌కు చెందిన హెన్లీ అండ్ పార్ట్‌నర్స్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజరీ ఫర్మ్ యొక్క గ్లోబల్ సిటిజన్స్ రిపోర్ట్ తెలిపింది.

Richest Cities: 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 20సంపన్న నగరాల్లో ముంబై ఉంటుంది

Mumbai City

Richest Cities: 2030 నాటికి అత్యధిక మిలియనీర్లు ఉన్న టాప్ 20 నగరాల జాబితాలోకి ప్రవేశించే మూడు నగరాల్లో భారతదేశ ఆర్థిక రాజధాని ముంబై కూడా ఒకటి అని క్యూ3(జూలై-సెప్టెంబర్) 2022కోసం లండన్‌కు చెందిన హెన్లీ అండ్ పార్ట్‌నర్స్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజరీ ఫర్మ్ యొక్క గ్లోబల్ సిటిజన్స్ రిపోర్ట్ తెలిపింది. ఇతర రెండు నగరాలు దుబాయ్, యుఏఈలో అత్యధిక జనాభా కలిగిన నగరం, చైనా యొక్క టెక్‌హబ్ అయిన షెన్‌జెన్‌గా నివేదిక పేర్కొంది. హెన్లీ అండ్ పార్ట్‌నర్స్ నివేదికలో ముంబైకి 25వ స్థానం లభించింది. ఇది దుబాయ్‌ కంటే రెండు స్థానాల్లో వెనుకబడి ఉంది. మహారాష్ట్ర రాజధానిలో 60,600 మంది మిలియనీర్లు, 243 మంది సెంటీ మిలియనీర్లు, 30 మంది బిలియనీర్లు ఉన్నట్లు నివేదిక పేర్కొంది.

World Most Polluted Cities: ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరాల జాబితాలో భారత్‌లోని ఆ రెండు నగరాలు..

మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం.. ప్రపంచంలోని 10 అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజీలలో ఒకటిగా ఉన్న ముంబైకి చెందిన బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) గురించి కూడా నివేదిక పేర్కొంది. భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన నగరంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాలలో ఆర్థిక సేవలు, మీడియా, రియల్ ఎస్టేట్ ఉన్నాయి. మరోవైపు, దుబాయ్‌లో 67,900 మంది మిలియనీర్లు, 202 మంది సెంటి-మిలియనీర్లు, 13 మంది బిలియనీర్లు నివసిస్తున్నారు. అయితే 30వ స్థానంలో ఉన్న షెన్‌జెన్‌లో 43,600 మంది మిలియనీర్లు, 135 సెంటీ-మిలియనీర్లు, 17మంది బిలియనీర్లు ఉన్నారు.

Noisy Cities: ప్రపంచంలో రెండవ అత్యంత శబ్ద కాలుష్య నగరం మొరాదాబాద్: జాబితాలో ఢిల్లీ, కోల్‌కతా కూడా

ప్రపంచంలో అత్యంత సంపన్న నగరాల జాబితాలో న్యూయార్క్ అగ్రస్థానంలో ఉంది. మొదటి పది స్థానాల్లో నాలుగు ఇతర అమెరికన్ నగరాలు (శాన్ ఫ్రాన్సిస్కో-3, లాస్ ఏంజిల్స్-6, చికాగో-7 మరియు హ్యూస్టన్-8) చేరాయి. డల్లాస్-ఫోర్ట్ వర్త్ టాప్ 20లో 18వ స్థానంలో ఉన్న ఆరవ, చివరి అమెరికన్ నగరం. సపన్న నగరాల జాబితాలో టోక్యో (2వ స్థానం), శాన్ ఫ్రాన్సిస్కో బే ప్రాంతం(3), లండన్ (4), సింగపూర్ (5), లాస్ ఏంజిల్స్(6), చికాగో(7), హ్యూస్టన్(8), బీజింగ్ (9), షాంఘై (10), సిడ్నీ (11), హాంకాంగ్ (12), ఫ్రాంక్‌ఫర్ట్ (13), టొరంటో (14), జ్యూరిచ్ (15), సియోల్ (16), మెల్‌బోర్న్ (17), జెనీవా (19), పారిస్ (20వ స్థానం) ఉన్నాయి.