Noisy Cities: ప్రపంచంలో రెండవ అత్యంత శబ్ద కాలుష్య నగరం మొరాదాబాద్: జాబితాలో ఢిల్లీ, కోల్‌కతా కూడా

ప్రపంచంలోనే అత్యంత శబ్ద కాలుష్య నగరాల్లో ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ రెండో స్థానంలో నిలిచింది. ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం ఈ విషయాలు వెల్లడించింది

Noisy Cities: ప్రపంచంలో రెండవ అత్యంత శబ్ద కాలుష్య నగరం మొరాదాబాద్: జాబితాలో ఢిల్లీ, కోల్‌కతా కూడా

Moradabad

Noisy Cities: ప్రపంచ వ్యాప్తంగా నానాటికీ కాలుష్యం పెరిగిపోతుంది. ముఖ్యంగా నగరాల్లో అన్నిరకాల కాలుష్యాలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వాయు, నీటి కాలుష్యంతో పాటు శబ్ద కాలుష్యం ప్రపంచాన్ని వేధిస్తోంది. ఈకాలుష్య ప్రభావాలకు మానవ తప్పిదాలే కారణమైనప్పటికీ..భూమిపై ఇతర జంతుజాలం కూడా కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్నాయి. ఇదిలాఉంటే..ప్రపంచంలోనే అత్యంత శబ్ద కాలుష్య నగరాల్లో ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ రెండో స్థానంలో నిలిచింది. ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (UNEP) 2022కి గానూ ప్రచురించిన “వార్షిక సరిహద్దు నివేదిక”లో ఈ విషయాలు వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక శబ్దకాలుష్య ప్రాంతాలుగా 61 నగరాలతో కూడిన జాబితాను UNEP ఇటీవల విడుదల చేసింది.

Also Read:Summer Sharbat : వేసవిలో చల్లదనంతోపాటు ఆరోగ్యం కోసం సోంపు షర్బత్

వీటిలో 119 డెసిబుల్స్ తో బంగ్లాదేశ్ రాజధాని ఢాకా అగ్రస్థానంలో ఉండగా.. 114 డెసిబుల్స్ తో ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ రెండో స్థానంలో ఉంది. ఇక కోల్‌కతా, అసాన్సోల్ నగరాల్లో 89 డెసిబుల్స్, జైపూర్ 84 డెసిబుల్స్, ఢిల్లీలో 83 డెసిబుల్స్ స్థాయిలో శబ్ద కాలుష్యం ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. జాబితాలోని టాప్ 15 నగరాల్లో మూడు అగ్రస్థానాలు భారత్ నాగరాలే ఉండడం దేశంలో శబ్ద కాలుష్య పరిస్థితికి అద్దం పడుతుంది. రోడ్డు ట్రాఫిక్, ఎయిర్ ట్రాఫిక్, రైల్వేలు, యంత్రాలు, పరిశ్రమలు మరియు వినోద కార్యకలాపాలు వంటి కారకాల నుంచి శబ్ద కాలుష్యం వెలువడుతుందని ఇది మనుషుల శారీరక మరియు మానసిక పరిస్థితులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also Read:Electric Two Wheeler: పేలుతున్న విద్యుత్ స్కూటర్లు: ఎండాకాలం వాహనదారులు జాగ్రత్త

ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO మార్గదర్శకాల మేరకు.. ప్రాంతాలను పరిస్థితులను బట్టి “శబ్ద స్థాయిలు” నిర్ణయించబడ్డాయి. నగరాల్లో రెసిడెన్షియల్ ఏరియాల్లో ఆ స్థాయి పరిమితి 55 డెసిబుల్స్ గా నిర్ణయించగా..బహిరంగ ప్రాంతాలు, ట్రాఫిక్, పారిశ్రామిక వాడల్లో ఆ పరిమితి 70 డెసిబుల్స్ గా నిర్ణయించారు. ఈ పరిమితికి మించి శబ్ద కాలుష్యం పెరిగితే..రానున్న రోజుల్లో మనుషుల్లో వినికిడి సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక UNEP విడుదల చేసిన వార్షిక నివేదికలో..60 డెసిబుల్స్ వద్ద జోర్డాన్ లోని ఇర్బిడ్, 69 డిబి వద్ద ఫ్రాన్స్‌ లోని లియోన్, 69 డిబి వద్ద స్పెయిన్‌లోని మాడ్రిడ్, 70 డిబి వద్ద స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్ మరియు సెర్బియా రాజధాని బెల్గ్రేడ్ నగరాలూ ప్రపంచంలోని నిశ్శబ్ద నగరాలుగా నిలిచాయి.

ప్రపంచంలోని 15 అత్యంత శబ్ద కాలుష్య నగరాలు
ఢాకా (బంగ్లాదేశ్) – 119 డిబి
మొరాదాబాద్ (భారతదేశం) – 114 డిబి
ఇస్లామాబాద్ (పాకిస్తాన్) – 105 డిబి
రాజ్‌షాహి (బంగ్లాదేశ్) – 103 డిబి
హో చి మిన్ సిటీ (వియత్నాం) – 103 dB
ఇబాడాన్ (నైజీరియా) – 101 డిబి
కుపొండోల్ (నేపాల్) – 100 డిబి
అల్జీర్స్ (అల్జీరియా) – 100 డిబి
బ్యాంకాక్ (థాయ్‌లాండ్) – 99 డిబి
న్యూయార్క్ (US) – 95 dB
డమాస్కస్ (సిరియా) – 94 డిబి
మనీలా (ఫిలిప్పీన్స్) – 92 డిబి
హాంకాంగ్ (చైనా) – 89 dB
కోల్‌కతా (భారతదేశం) – 89 డిబి
అసనోల్ (భారతదేశం) – 89 dB

Also Read:Political Speeches: చిరునవ్వు ప్రసంగాలు నేరంగా పరిగణించలేం: ఢిల్లీ హైకోర్ట్