Summer Sharbat : వేసవిలో చల్లదనంతోపాటు ఆరోగ్యం కోసం సోంపు షర్బత్

మూత్ర విసర్జనలో కలిగి ఇబ్బందులను తొలగిస్తుంది అంతేకాకుండా శరీరంలో ఉండే వ్యర్ధపదార్ధాలను బయటకు పంపటంలో తోడ్పడుతుంది. మూత్రశాయ ఇన్ ఫెక్షన్లు దరిచేరకుండా కాపాడుతుంది.

Summer Sharbat : వేసవిలో చల్లదనంతోపాటు ఆరోగ్యం కోసం సోంపు షర్బత్

Fennel Water

Summer Sharbat : ఆహారం తిన్న తర్వాత సరిగ్గా జీర్ణం అవ్వడానికి సోంపుని తినంటం చాలా మందికి అలావాటు. సోంపు గింజల్లో శక్తి వంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ తో పాటు, ఎన్నో పోషకాలు కూడా లభ్యమవుతాయి. సోంపు గింజల్లో రాగి, పొటాషియం, జింక్, విటమిన్ సి, ఇనుము, సెలెలియం, మాంగనీస్ మరియు క్యాల్షియం వంటి ఖనిజాలు అధిక మొత్తంలో లభ్యమవుతాయి. మౌత్ ఫ్రెషనర్లు, ఐస్ క్రీములు మరియు పేస్ట్ ఇలా అనేక వాటిల్లో సోంపు గింజలు వాడుతారు.

ముఖ్యంగా వేసవి కాలంలో శరీర ఉష్ణోగ్రతలను తగ్గించటంలో సొంపు షర్బత్ అద్భుతమైనదిగా చెప్పవచ్చు. ఎండలు బాగా మండిపోతున్న సమయంలో నీరసం, అలసట వంటి వాటిని దూరం చేయటమే కాకుండా బరువును సైతం తగ్గించుకునేందుకు ఈ డ్రింక్ దోహదపడుతుంది. సోంపు షర్బత్ శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించేందుకు సహాయపడుతుంది. రక్తపోటుని సాధారణంగా ఉండేలా చూస్తుంది. సోంపు గింజల్లో పొటాషియం కూడా అధికంగా లభిస్తుంది. ఇది శరీరంలో నీటిని సమతుల్యతతో ఉండేలా చూస్తుంది.

మూత్ర విసర్జనలో కలిగి ఇబ్బందులను తొలగిస్తుంది అంతేకాకుండా శరీరంలో ఉండే వ్యర్ధపదార్ధాలను బయటకు పంపటంలో తోడ్పడుతుంది. మూత్రశాయ ఇన్ ఫెక్షన్లు దరిచేరకుండా కాపాడుతుంది. రక్తహీనత భారిన పడకుండా కాపాడుతుంది. ప్రేగుల్లో మంట తగ్గుతుంది. రక్తంలో చెడు కొవ్వుని తగ్గించి మంచి కొవ్వుని పెంచటంలో సోంపు జ్యూస్ సహాయపడుతుంది. గుండె సంబంధిత వ్యాధులు, గుండెపోటు రాకుండా ఇది నియంత్రిస్తుంది.

సోంపు గింజల షర్భత్ తయారీ విధానం ;

దీని కోసం ముందుగా ఒక స్పూన్ తులసి గింజలను నీటిలో రెండు గంటల పాటు నానబెట్టాలి. అనంతరం ఒక మిక్సీ జార్ లో ఒక స్పూన్ సొంపు గింజలు, ఒక స్పూన్ పటికబెల్లం పొడి, రెండు యాలకులు వేసి మెత్తని పొడిగా తయారుచేసుకోవాలి. దీనిలో పావు స్పూన్ లో సగం నిమ్మ ఉప్పు, అరచెక్క నిమ్మరసం, ఒక గ్లాస్ నీటిని పోసి మిక్సీ చేయాలి. ఆ తర్వాత నానబెట్టి ఉంచుకున్న తులసి గింజలను వేసి ఒకసారి మిక్సీ చేసి గ్లాస్ లో పోసుకొని తాగాలి. ఈ డ్రింక్ తాగటం వలన శరీరంలో వేడి తగ్గటమే కాకుండా జీర్ణప్రక్రియను వేగవంతం చేసి కడుపు ఉబ్బరం,మలబద్దకం వంటి సమస్యలు లేకుండా చేస్తుంది. అయితే వివిధ రకాల సమస్యలతో బాధపడుతున్న వారు మాత్రం వైద్యుల సూచనలు, సలహాలు తీసుకుని మాత్రమే దీనిని తీసుకోవాల్సి ఉంటుంది.