Political Speeches: చిరునవ్వు ప్రసంగాలు నేరంగా పరిగణించలేం: ఢిల్లీ హైకోర్ట్

నేతలు చేసే ప్రసంగాలు నవ్వు పుట్టించే విధంగా ఉంటే వాటిని నేరంగా పరిగణించలేమని..అభ్యంతరకరంగా ఉంటే మాత్రం నేరమే అవుతుందని ధర్మాసనం పేర్కొంది.

Political Speeches: చిరునవ్వు ప్రసంగాలు నేరంగా పరిగణించలేం: ఢిల్లీ హైకోర్ట్

Political

Political Speeches: ఎన్నికల ప్రసంగాలపై ఢిల్లీ హై కోర్ట్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల ప్రసంగాలకు, సాధారణ ప్రసంగాలకు వ్యత్యాసం ఉంటుందని..రాజకీయ నేతలు ఒక్కోసారి ఎలాంటి ఉద్దేశం లేకుండా..సమావేశాల్లో చక్కని వాతావరణం సృష్టించేందుకు వ్యంగ్య ప్రసంగాలు చేస్తుంటారని, ప్రజలను శాంతపరిచి నవ్వు తెప్పించే అటువంటి ప్రసంగాలను నేరంగా పరిగణించలేమని ఢిల్లీ హై కోర్ట్ స్పష్టం చేసింది. ఈశాన్య ఢిల్లీ అల్లర్ల ఘటనలో కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్, ఎంపీ పర్వేష్‌వర్మలపై ద్వేషపూరిత ప్రసంగాల ఆరోపణలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ ఇటీవల సీపీఎం నేత బృందాకారత్ హైకోర్టును ఆశ్రయించారు. కేసును విచారించిన జస్టిస్ చంద్రధారి సింగ్ ఈమేరకు పై వ్యాఖ్యలు చేశారు.

Also Read:Instagram : భర్త అనుకుని సోషల్ మీడియాలో చాటింగ్…ప్రైవేట్ ఫోటోలు అడిగే సరికి….!

“నేతలు చేసిన ప్రసంగాలు రాజకీయ ప్రసంగాలా? సాధారణ ప్రసంగాలా? సమయం సందర్భం ఏంటి? అని ధర్మాసనం పిటిషన్ దారున్నీ ప్రశ్నించింది. “ఎందుకంటే రాజకీయ ప్రసంగాల సమయంలో ప్రజల మెప్పు పొందేందుకు నేతలు ఏవేవో ప్రసంగాలు చేస్తుంటారు. అది కూడా తప్పే అయినప్పటికీ ఆయా ప్రసంగాలను చూసే విధానం చట్టం కోణంలో మరోలా ఉంటుందని” హైకోర్టు వివరించింది. నేతలు చేసే ప్రసంగాలు నవ్వు పుట్టించే విధంగా ఉంటే వాటిని నేరంగా పరిగణించలేమని..అభ్యంతరకరంగా ఉంటే మాత్రం నేరమే అవుతుందని ధర్మాసనం పేర్కొంది.

Also read:Hijab Row: కర్ణాటకలో కొత్త వివాదం.. ముదిరిన ఆలయాల్లో ముస్లిం వ్యాపారాల బహిష్కరణ

బృందాకారత్ వేసిన పిటిషన్ పై తీర్పును రిజర్వులో ఉంచింది హైకోర్ట్ ధర్మాసనం. ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు అందరికీ ఉంటుందన్న ధర్మాసనం..నేతలు తమ ప్రసంగాలతో ప్రజలను రెచ్చగొడితే అది నేరమే అవుతుందని, అలా కాకుండా..నవ్వు తెప్పించే విధంగా చేసే వ్యాఖ్యలను నేరంగా పరిగణించలేమని జస్టిస్ చంద్రధారి సింగ్ వివరించారు. రాజకీయ నేతలు సందర్భాన్నిబట్టి, ఉచిత -హాస్యాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారని..వాటిని మనం ఏ కోణంలో తీసుకున్నామనేదే విశేషమని ధర్మాసనం పేర్కొంది. అలాకాని పక్షంలో వారు చేసే అతి తీవ్ర ప్రసంగాల కారణంగా వారిపై వేలల్లో కేసులు నమోదు అయ్యే అవకాశం ఉందని ఢిల్లీ హైకోర్ట్ తెలిపింది.

Also read:Chittoor : నిశ్చితార్థం సంబరాల్లో విషాదం.. 50 అడుగుల లోతులో పడిన బస్సు, మృతుల వివరాలు