Instagram : భర్త అనుకుని సోషల్ మీడియాలో చాటింగ్…ప్రైవేట్ ఫోటోలు అడిగే సరికి…!

ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ వాడకం మొదలు పెట్టిన తర్వాత సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో యాక్టివ్ గా ఉండి తమ అనుభవాలను,ఆనందాలను షేర్ చేసుకుంటూ ఉన్నారు. ఒక మహిళ తన భర్త ప్రోపైల్ వెరిఫై

Instagram : భర్త అనుకుని సోషల్ మీడియాలో చాటింగ్…ప్రైవేట్ ఫోటోలు అడిగే సరికి…!

Instagram

Instagram :  ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ వాడకం మొదలు పెట్టిన తర్వాత సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో యాక్టివ్ గా ఉండి తమ అనుభవాలను,ఆనందాలను షేర్ చేసుకుంటూ ఉన్నారు. ఒక మహిళ తన భర్త ప్రోపైల్ వెరిఫై చేసుకోకుండా వేరోకరితో చాటింగ్ చేసి చిక్కుల్లో పడిన ఘటన ముంబై లో చోటు చేసుకుంది.

ముంబైలోని మలాడ్ దిన్‌దోషి ఏరియాలో ఒక కుటుంబం అపార్ట్ మెంట్‌లో నివాసం ఉంటోంది. ఒకరోజు భార్య ఇన్‌స్టా‌గ్రాం ఎకౌంట్‌కు భర్త ఇన్‌స్టాగ్రాం ఎకౌంట్ నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తే యాక్సెప్ట్ చేసింది. అప్పటి నుంచి రోజు భర్తతో చాటింగ్ చేస్తోంది. ఈక్రమంలో ఒకరోజు అతను కోరితే తన ప్రైవేట్ ఫోటోలు కూడా పంపింది. అలా మూడు నెలలు గడిచాయి.

ఒకరోజు అదేపనిగా ఫోటోలు పంపమని రిక్వెస్ట్ వస్తుంటే అనుమానం వచ్చి భర్తపై చిరాకు పడింది. పంపించకపోతే ఇంతకు ముందు పంపించిన ప్రైవేట్ ఫోటోలు ఇంటర్నెట్ లో పెడతానని బెదిరింపు వచ్చింది. దీంతో అలర్టైన మహిళ సాయంత్రం భర్త ఆఫీసు నుంచి ఇంటికి రాగానే నిలదీసింది. తనకు అసలు ఇన్‌స్టా‌గ్రాం ఎకౌంటే లేదని భర్త చెప్పటంతో అవాక్కయ్యింది. దీంతో ఎవరో తనను బ్లాక్ మెయిల్ చేశారని తెలుసుకుని వెంటనే సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు భార్య భర్తలు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ఫ్రారంభించారు. ఆమె చాట్ చేసిన ఐపీ అడ్రస్ ఆధారాంగా కూపీ లాగితే అది వారి అపార్ట్ మెంట్‌లో, పక్కప్లాట్ లోని 20 ఏళ్ల యువకుడి ఎకౌంట్ అని తేలింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడు చేసిన వ్యవహారం తెలుసుకుని ఆశ్చర్యపోయారు.
Also Read : Chittoor : నిశ్చితార్థం సంబరాల్లో విషాదం.. 50 అడుగుల లోతులో పడిన బస్సు, మృతుల వివరాలు
బాధితురాలి ఇన్‌స్టా‌గ్రాం ఎకౌంట్ లోంచి ఆమె భర్త ఫోటో సేకరించి దాని ద్వారా.. ఆమె భర్త పేరుతో ఫేక్ ఎకౌంట్ క్రియేట్ చేసి ఆమెకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించినట్లు నిందితుడు నేరం ఒప్పుకున్నాడు. రెండు కుటుంబాల మధ్య ఏర్పడిన చిన్నపాటి వివాదంతో మహిళ కుటుంబాన్ని ఇబ్బందుల పాలు చేయాటానికే ఈవికృతచేష్టకు పాల్పడినట్లు నిందితుడు అంగీకరించాడు. నిందితుడిపై ఐపీసీ లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.