CM Jagan Kuppam Tour: సీఎం హోదాలో తొలిసారిగా.. నేడు చంద్రబాబు ఇలాకాలో సీఎం జగన్ పర్యటన..

ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి ఈ రోజు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. సీఎం హోదాలో తొలిసారి జగన్ కుప్పం నియోజకవర్గంలో అడుగుపెడుతున్న నేపథ్యంలో ఘనస్వాగతం పలికేందుకు స్థానిక వైసీపీ నేతలు ఏర్పాట్లు చేశారు.

CM Jagan Kuppam Tour: సీఎం హోదాలో తొలిసారిగా.. నేడు చంద్రబాబు ఇలాకాలో సీఎం జగన్ పర్యటన..

AP CM Jagan

CM Jagan Kuppam Tour: ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి ఈ రోజు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. సీఎం హోదాలో తొలిసారి జగన్ కుప్పం నియోజకవర్గంలో అడుగుపెడుతున్న నేపథ్యంలో ఘనస్వాగతం పలికేందుకు స్థానిక వైసీపీ నేతలు ఏర్పాట్లు చేశారు. ఉదయం 9.15 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి రేణిగుంట మీదుగా 10.45 గంటలకు జగన్ కుప్పం చేరుకుంటారు. ఈ సందర్భంగా కుప్పంలో నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. కుప్పం నియోజకవర్గం పర్యటనలో భాగంగా మూడో విడత వైఎస్ఆర్ చేయూత పథకం నిధులను జగన్ విడుదల చేస్తారు.

Ban on Plastic flexies in AndhraPradesh: ఏపీలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం.. నోటిఫికేషన్ జారీ

45 నుంచి 60ఏళ్ల మధ్య వయస్సు గల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఈ పథకం ద్వారా ప్రతీయేటా ప్రభుత్వం రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో మొత్తం రూ.75వేలు ఆర్థిక సాయం చేయడం ద్వారా వారి జీవనోపాధిని మెరుగుపరుస్తున్నారు. ఈ క్రమంలో మూడో విడత నిధులను సీఎం జగన్ కంప్యూటర్ లో బటన్ నొక్కి విడుదల చేస్తారు. మూడో విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 26,39,703 మంది అక్కచెల్లెమ్మల ఖాతాల్లో రూ. 4,949.44 కోట్ల ఆర్థిక సాయాన్ని లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా జమ చేయనున్నారు. ఇదిలాఉంటే కుప్పం పురపాలక సంఘం అభివృద్ధికి సంబంధించి రూ.66కోట్ల విలువైన పనులకు సీఎం జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపన చేస్తారు. రూ. 11 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ కార్యాలయాల సముదాయం ప్రారంభోత్సవానికి అధికారులు ఏర్పాట్లు చేశారు.

Kalvakuntla Taraka Rama Rao slams bjp: తెలంగాణలోని ఒక్క బీజేపీ జోకర్‌కూ దమ్ములేదు: కేటీఆర్

ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి సీఎం జగన్ మోహన్ రెడ్డి కుప్పం నియోజకవర్గంలో అడుగుపెడుతున్న నేపథ్యంలో ఘన స్వాగతం పలికేందుకు స్థానిక వైసీపీ నేతలు ఏర్పాట్లు చేశారు. జగన్ పర్యటించే ప్రాంతాల్లో భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు, స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. కుప్పం నియోజకవర్గంలో జగన్ పర్యటన ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగురవేసేలా జగన్ పట్టుదలతో ఉన్నారు. ఇప్పటికే వైసీపీ నేతలు నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టిసారించారు. మరోవైపు జగన్ పర్యటించే ప్రాంతాల్లో పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. పలువురు తెదేపా నేతలను గృహనిర్భందం చేశారు.