Kalvakuntla Taraka Rama Rao slams bjp: తెలంగాణలోని ఒక్క బీజేపీ జోకర్‌కూ దమ్ములేదు: కేటీఆర్
బీజేపీ తెలంగాణ నేతలపై మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘‘మనకు న్యాయపరంగా రావాల్సిన అంశాల గురించి డిమాండ్ చేయడానికి తెలంగాణలోని ఒక్క బీజేపీ జోకర్ కూ దమ్ములేదు. గుజరాతీ బాస్ ల చెప్పులు మోసేందుకు బీజేపీ తెలంగాణ నేతలు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. తెలంగాణ హక్కుల గురించి నిలదీయడానికి మాత్రం వారికి ధైర్యం లేదు. మోదీవర్స్ కు గుజరాత్ కేంద్ర బిందువుగా మారిపోయింది’’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన ఓ ట్వీట్ ను కేటీఆర్ రీట్వీట్ చేశారు.

Not a single BJP joker from Telangana has the guts to demand what is rightfully ours Kalvakuntla Taraka Rama Rao slams bjp
Kalvakuntla Taraka Rama Rao slams bjp: బీజేపీ తెలంగాణ నేతలపై మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘‘మనకు న్యాయపరంగా రావాల్సిన అంశాల గురించి డిమాండ్ చేయడానికి తెలంగాణలోని ఒక్క బీజేపీ జోకర్ కూ దమ్ములేదు. గుజరాతీ బాస్ ల చెప్పులు మోసేందుకు బీజేపీ తెలంగాణ నేతలు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. తెలంగాణ హక్కుల గురించి నిలదీయడానికి మాత్రం వారికి ధైర్యం లేదు. మోదీవర్స్ కు గుజరాత్ కేంద్ర బిందువుగా మారిపోయింది’’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
ఈ సందర్భంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన ఓ ట్వీట్ ను కేటీఆర్ రీట్వీట్ చేశారు. అందులో కేంద్ర ప్రభుత్వంపై ప్రొ.నాగేశ్వర్ తీవ్ర విమర్శలు గుప్పిస్తూ పలు అంశాలను ప్రస్తావించారు. ఆస్కార్ రేసులో గుజరాతీ సినిమా చేతిలో రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా ఓడిపోయిందని అందులో నాగేశ్వర్ పేర్కొన్నారు. తెలంగాణలోని కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదని చెప్పారు.
అదే సమయంలో గుజరాత్‌కు మాత్రం లోకోమోటివ్ ఫ్యాక్టరీ ఇచ్చారని చెప్పారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు రావాల్సిన డబ్ల్యూహెచ్‌వో కేంద్రాన్నిగుజరాత్‌లోని జామ్‌నగర్‌కు తరలించారని అన్నారు. అంతేగాక, హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ కేంద్రానికి పోటీగా గుజరాత్‌లో ఓ కేంద్రాన్ని తెరిచారని చెప్పారు.
కాగా, ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాను ఆస్కార్‌కు నామినేట్ చేయకుండా ‘ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా’ గుజరాతీ సినిమా ‘ఛెల్లో షో’ను ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఆస్కార్‌కు నామినేట్ చేసిన విషక్ష్ం తెలిసిందే. దీనిపై పలువురు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.