Man Drinks At 75 Pubs: కుక్కలకు నిధుల సేకరణ కోసం సాహసం.. ఒక్క రోజులోనే 75 పబ్బుల్లో మందు తాగిన యువకుడు

కుక్కల మీద ప్రేమతో ఒక యువకుడు సాహసం చేశాడు. వాటి సంక్షేమం కోసం నిధులు సేకరించేందుకు అరుదైన పని చేశాడు. 24 గంటల్లో, 75 పబ్బుల్లో డ్రింక్ తాగి రికార్డు సృష్టించాడు.

Man Drinks At 75 Pubs: కుక్కలకు నిధుల సేకరణ కోసం సాహసం.. ఒక్క రోజులోనే 75 పబ్బుల్లో మందు తాగిన యువకుడు

Man Drinks At 75 Pubs: తాము చేయాలనుకుంటున్న మంచి పనికి నిధులు సేకరించేందుకు కొందరు ఏదో ఒక కొత్త పని చేస్తుంటారు. తాజాగా కుక్కల సంక్షేమం కోసం నిధులు సేకరించేందుకు ఒక వ్యక్తి అరుదైన సాహసం చేశాడు. ఒక్క రోజులోనే (24 గంటలు) 75 పబ్బుల్లో మందు తాగి విరాళాలు సేకరించాడు.

Honour Killing: పరువు హత్య కేసు… కూతురును, ఆమె ప్రియుడిని చంపిన తల్లిదండ్రులు.. మరణ శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు

బ్రిటన్‌కు చెందిన నాథన్ క్రింప్ అనే 22 ఏళ్ల యువకుడి పెంపుడు కుక్క 2020లో క్యాన్సర్‌తో మరణించింది. దీంతో అలాంటి ఎన్నో కుక్కలను సంరక్షించాలనుకున్నాడు. కానీ, దీనికి నిధులు కావాలి. ముందుగా కుక్కల కోసం ఒక షెల్టర్ హౌజ్ ఏర్పాటు చేసి, వాటి కోసం విరాళాలు సేకరించడం మొదలుపెట్టాడు. ఇందుకోసం ఒక ప్రకటన విడుదల చేశాడు. ఈ నెల 17న బ్రిటన్‌లోని పబ్బులకు వెళ్లి విరాళాలు సేకరిస్తానని, ఎవరికి తోచిన విరాళాలు వాళ్లు ఇవ్వాలని కోరాడు. ఈ విరాళాల సందర్భంగా అతడు కుక్కను పోలిన కాస్ట్యూమ్స్ ధరించాలని సిద్దమయ్యాడు. అలాగే అంతకుముందు గ్యారెత్ ముర్ఫి అనే వ్యక్తి సాధించిన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును బ్రేక్ చేయాలనుకున్నాడు.

Uttar Pradesh Rains: ఉత్తర ప్రదేశ్‌ను ముంచెత్తిన వానలు.. 13 మంది మృతి.. పలు ప్రాంతాలు జలమయం

గ్యారెత్ గతంలో 24 గంటల్లో 54 పబ్బులు తిరిగి మద్యం తాగాడు. దీన్ని అధిగమించేందుకు క్రింప్ సిద్దమయ్యాడు. అనుకున్నట్లుగానే, ఈ నెల 17న బ్రిటన్‌లోని పబ్బులు తిరగడం ప్రారంభించాడు. ఒక పబ్బులో మద్యం.. మరో పబ్బులో నాన్ ఆల్కహాలిక్ డ్రింక్ తాగాడు. ఆల్కహాల్‌కు, ఆల్కహాల్‌కు మధ్యలో చిన్న విరామం ఇవ్వాలనే ఉద్దేశంతోనే అలా చేశాడు. అలా మొత్తానికి 17 గంటల్లోనే 67 పబ్బులు తిరిగాడు. దీంతో పాత రికార్డును బ్రేక్ చేశాడు. కాగా, మొత్తం 24 గంటల్లో 75 పబ్బుల్లో డ్రింక్ తాగినట్లు అతడి సన్నిహితులు చెబుతున్నారు. ఈ విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఏదేమైనా కుక్కల మీద ప్రేమతో, వాటిని సంరక్షించేందుకు నాథన్ క్రింప్ చేసిన సాహసం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.